భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. మొదటి రెండు టెస్ట్‌‌‌‌లకు దూరమైన కీలక ఆటగాడు.. ఆ బ్యాట్స్‌‌‌‌‌మెన్ ఎవరంటే..

టీమిండియా శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ తో తలపడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో ఇరు జట్లు గెలుపే లక్యంగా బరిలోకి దిగనున్నాయి..

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. మొదటి రెండు టెస్ట్‌‌‌‌లకు దూరమైన కీలక ఆటగాడు.. ఆ బ్యాట్స్‌‌‌‌‌మెన్ ఎవరంటే..

Updated on: Feb 04, 2021 | 8:51 PM

India Vs England 2021: టీమిండియా శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ తో తలపడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు చెన్నైలో జరుగనుండగా.. రెండో టెస్టు నుంచి మైదానంలోకి అభిమానులను అనుమతించనున్నారు. ఉత్కంఠగా సాగే ఈ మ్యాచ్ కు ముందే ఇంగ్లాండ్ టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది.

ఇంగ్లాండ్ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ మణికట్టు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది. దాంతో అతడు చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. అతడు తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని ఇంగ్లాండ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా క్రాలీ ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘బీ కేర్‌ఫుల్ టీమిండియా’.. కోహ్లీసేనకు ఇంగ్లాండ్ కెప్టెన్ వార్నింగ్.. అసలు ఏమన్నాడంటే.!