Joe Root: వరుస వైఫల్యాలతో జో రూట్‌ సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్‌..

England Cricket:  ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చాడు.

Joe Root: వరుస వైఫల్యాలతో జో రూట్‌ సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్‌..
Joe Root
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2022 | 3:20 PM

England Cricket:  ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఇటీవల టెస్ట్‌ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటోంది. వీటికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కాగా అలిస్టర్‌ కుక్‌ వారసుడిగా 2017లో టెస్ట్‌ సారథిగా పగ్గాలందుకున్నాడు జో రూట్‌ (Joe Root). ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (64మ్యాచ్‌లు) ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆటగాడిగా, నాయకుడిగా ఇంగ్లండ్‌ జట్టు(England Cricket) కు 27 విజయాలు అందించాడు. తద్వారా కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

కుక్ వారసుడిగా..

అయితే గత కొన్ని నెలలుగా ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న రూట్‌ తన జట్టును మాత్రం గెలుపు తీరాలకు చేర్చలేకపోతున్నాడు. ముఖంగా గత భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ని 3-1 తేడాతో కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైంది. ఆపై సొంత గడ్డపై భారత జట్టుతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 2-1 తేడాతో వెనకబడింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక భారీ అంచనాలతో యాషెస్ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన జో రూట్ సేన 4-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత బలహీనంగా ఉన్న వెస్టిండీస్‌తోనూ 1-0 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. కాగా రూట్ కెప్టెన్సీలో ఆడిన చివరి 17 టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక విజయం సాధించడం గమనార్హం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ ఆ జట్లు అట్టడుగు స్థానంలో ఉంది. ఈక్రమంలోనే రూట్‌ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి.

కోహ్లీ ‘రూట్‌’లోనే!

ఈ సందర్భంగా టెస్ట్‌ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రూట్‌ ‘ నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరికొంత కాలం సారథిగా కొనసాగాలని భావించాను. అయితే ఇటీవల కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై కూడా ప్రభావం చూపింది. నా స్థానంలో ఎవరు వచ్చినా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు’ అని తెలిపాడు. కాగా కెప్టెన్ గా ఫెయిలైనా.. ఆటగాడిగా మాత్రం జో రూట్ అద్భుత రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 117 టెస్టులాడిన జో రూట్ 9,889 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. విరాట్ కోహ్లీ బాటలోనే ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి ప్లేయర్ గా కొనసాగనున్నాడు రూట్. కాగా టెస్ట్‌ క్రికెట్‌లో కోహ్లీకీ పోటీ అని భావించే జోయ్‌ రూట్‌ ఇప్పుడు విరాట్‌ బాటలోనే నడిచి కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

Also Read: Rajasthan: రాజస్థాన్‌లో మిస్టరీ వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి.. నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందాలు..

సొగసులతో సోయగం సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోస్

KTR: వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని ప్రయత్నించారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్