Eng Vs Pak: ఈ ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఊచకోత.. దెబ్బకు పాకిస్తాన్ డమాల్.. స్వదేశం చెత్త రికార్డు..

17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో..

Eng Vs Pak: ఈ ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఊచకోత.. దెబ్బకు పాకిస్తాన్ డమాల్.. స్వదేశం చెత్త రికార్డు..
England Vs Pakistan

Updated on: Dec 05, 2022 | 9:27 PM

17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయాన్ని అందుకుంది. 74 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టు పాకిస్థాన్‌ను స్వదేశంలో ఓడించడమే కాకుండా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఇక ఈ ఇంగ్లాండ్ విజయంలో ఆరుగురు ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్‌గా నిలిచారు. మరి వారెవరో తెలుసుకుందాం..

వీరే మ్యాచ్ విన్నర్స్..

  • ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 116 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 153 పరుగులు బాదేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో, అతడు 65 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టుకు మంచి స్కోర్ అందించడంలో తోడ్పడ్డాయి.
  • జాక్ క్రౌలీ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. క్రాలీ తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేశాడు.
  • బెన్ డకెట్, ఒలీ పోప్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. బెన్ 107 పరుగులు, పోప్ 108 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌ల సహకారంతోనే ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది.
  • బౌలింగ్ విషయానికొస్తే, విల్ జాక్స్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా, మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
  • రెండో ఇన్నింగ్స్‌లో ఒలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ చెరో నాలుగు వికెట్ల తీసి ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. డెడ్ పిచ్‌పై వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు.