India Vs England: టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు మరో భీకర పోరుకు సన్నద్దమవుతున్నాయి. అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య రేపటి నుంచి డే/నైట్ టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో.. ఈ టెస్టులో ఎవరు గెలుస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇది భారత్‌లో జరగబోయే రెండో డే/నైట్ టెస్టు కాగా.. పింక్ బాల్ మ్యాచ్‌లలో టీమిండియాకు పెద్దగా ఘనమైన రికార్డు లేకపోవడం గమనార్హం.
ఐసీసీ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఆమోదముద్ర వేసిన దగ్గర నుంచి.. ఇప్పటిదాకా 15 దేశాలు ఆడటం జరిగింది. చాలా మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరగ్గా.. అందులో 50 శాతం పైగా విజయాలు హోం టీమ్ ఆసీస్ సాధించింది. ఇక రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలుపొందింది. మరి రేపు జరగబోయే డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ గెలుస్తుందా.? లేదా.?.. టీమిండియా విజయభేరి మ్రోగిస్తుందా.? అనేది ఇప్పుడు చూద్దాం..
డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో లైట్ క్షీణించిన కొద్దీ బంతి స్వింగ్ తిరుగుతుంది. ఇక దాన్ని అదనుగా తీసుకునేందుకు ఇంగ్లాండ్ జట్టులో అద్భుత బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ గురించి చెప్పాలి. డే/నైట్ టెస్టు మ్యాచ్‌లలో ఫస్ట్ వికెట్ తీసిన ఇంగ్లీష్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. 2017 ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆండర్సన్ పేస్‌కు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో విజయభేరి మ్రోగించింది. ఈ మ్యాచ్‌లో అలిస్టర్ కుక్, జో రూట్‌లు అమోఘమైన సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు అయిన ఆండర్సన్, బ్రాడ్, జోన్స్ ఏకంగా 19 వికెట్లు తీశారు. ఇక ఆ తర్వాత సంవత్సరం కూడా ఆండర్సన్ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ వచ్చాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లలో రూట్ అండ్ కో తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముఖ్యంగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్, సౌతీలు భీకర పేస్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ టీంను ముప్పుతిప్పలు పెట్టారు. కాబట్టి పేస్‌ను ఎదుర్కునే సరైన బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ తుది జట్టులో ఉంటే వారికి లాభం చేకూరుతుంది.
డే/నైట్ టెస్టు మ్యాచ్‌లలో టీమిండియాకు అతి పెద్ద బలం పేసర్ ఇషాంత్ శర్మ. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. మరో బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా ఐదు వికెట్లు తీయడం విశేషం. అటు ఇదే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కాడు.
నమ్మశక్యంగా లేకపోయినా, అడిలైడ్‌లో జరిగిన డే/నైట్ టెస్ట్‌లో టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ అయి జస్ట్ రెండు నెలలు మాత్రమే అయింది. 5-8 గణాంకాలను నమోదు చేసిన జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ (4-21) వంటి పేస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్ తలవంచారు. కేవలం 21.2 ఓవర్లలో భారత్ బ్యాటింగ్ చాపచుట్టింది. ఇలాంటి తరుణంలో టీమిండియా ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మొతేరాలో డే/నైట్ మ్యాచ్‌కు రెడీ అవుతుండటంతో.. అభిమానుల్లో కాసింత భయం నెలకొంది. మళ్లీ టీమిండియా బ్యాటింగ్ లైనప్ అలా ఔట్ కాకుండా.. నిలబడుతుందా.! అనే సందేహాలు వారిలో కలుగుతున్నాయి.
ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!