చేపలు పట్టేందుకు నదికి వెళ్తే.. మొసళ్లు, షార్క్‌‌ల మధ్య చిక్కుకున్న మాజీ క్రికెటర్.. కట్‌చేస్తే..

|

Nov 08, 2024 | 8:55 PM

62 ఏళ్ల హ్యూస్ తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఆస్ట్రేలియా తరపున 53 టెస్టులు ఆడి 212 వికెట్లు పడగొట్టాడు. బోథమ్ 102 టెస్టులు ఆడి 5200 పరుగులు చేసి 383 వికెట్లు తీశాడు. అతను ఆల్ టైమ్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకటిగా పేరుగాంచాడు.

చేపలు పట్టేందుకు నదికి వెళ్తే.. మొసళ్లు, షార్క్‌‌ల మధ్య చిక్కుకున్న మాజీ క్రికెటర్.. కట్‌చేస్తే..
Ian Botham Falls Into Rive
Follow us on

ఆస్ట్రేలియాలో మొసళ్లతో నిండిన నదిలో పడి ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ తృటిలో మరణాన్ని తప్పించుకున్నాడు. ఇయాన్ బోథమ్ ప్రాణాలను ఆస్ట్రేలియా క్రికెటర్ మెర్వ్ హ్యూస్ కాపాడాడు. నిజానికి, ఇయాన్ బోథమ్, మెర్వ్ హ్యూస్ ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో నాలుగు రోజుల ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లారు. నివేదిక ప్రకారం, ఇయాన్ చేపలు పట్టే క్రమంలో తన కాలు ఓ తాడులో చిక్కుకుపోయి మోయల్ నదిలో పడిపోయాడు.

మోయల్ నది మొసళ్లకు ఆవాసం..

68 ఏళ్ల ఇయాన్ నదిలో పడిపోయినప్పుడు, అతని చుట్టూ మొసళ్లు, బుల్ షార్క్‌లు ఉన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ మొసళ్లు, బుల్ షార్క్‌లు దాడి చేయడానికి ముందు ఇయాన్ బోథమ్‌ను అతని స్నేహితుడు మెర్వ్ హ్యూస్ నీటి నుంచి బయటకు తీశారు. ఇయాన్ బోథమ్ శరీరానికి మాత్రం గాయాలయ్యాయి.

అనంతరం జరిగిన సంఘటనను వివరిస్తూ మాజీ ఆల్‌రౌండర్, ‘నీటిలోకి పూర్తిగా మునిగిపోకముందే నేను బయటకు వచ్చాను. నీటిలో ఏమి ఉన్నాయో తలచుకుంటే ఒళ్లు జల్లుమంటోంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు

ఇయాన్ బోథమ్‌కు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం..

ఇయాన్ బోథమ్‌కు చిన్నప్పటి నుంచి నదిలో చేపలు పట్టడం అంటే ఇష్టం. అతను తన క్రికెట్ కెరీర్‌లో కూడా ఇలాగే చేసేవాడు. ఇయాన్ బోథమ్ ‘ది గార్డియన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘షూటింగ్ లేదా గోల్ఫ్ కంటే, ఫిషింగ్ నా అతిపెద్ద అభిరుచి. ఫ్లై-ఫిషింగ్ నన్ను ఆకర్షిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కామెంటరీ చేస్తా..

ఇయాన్ బోథమ్, మెర్వ్ హ్యూస్ ఆస్ట్రేలియాలో కలిసి వ్యాఖ్యానిస్తుంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌తో ఇయాన్ బోథమ్, మెర్వ్ హ్యూస్ ‘సమ్మర్ టూర్’ ప్రారంభమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..