Watch Video: పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ ఆల్ రౌండర్.. షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే?

|

May 13, 2022 | 9:18 AM

బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం కారణంగా అతను పిచ్‌పైనే పడిపోయాడు. దీంతో ప్రేక్షకులు కంగారు పడ్డారు. ఆటగాళ్లు కూడా అతని వద్దకు చేరుకున్నారు.

Watch Video: పిచ్‌పైనే కుప్పకూలిన స్టార్ ఆల్ రౌండర్.. షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే?
Ben Stokes
Follow us on

ఇంగ్లండ్‌కి టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత కౌంటీ క్రికెట్‌(Cricket)లో ఆడిన మొదటి మ్యాచ్‌ను బెన్ స్టోక్స్‌(Ben Stokes) ఎప్పటికీ మచ్చిపోలేడు. రికార్డు స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే, అదే ఉత్సాహంలో బెన్ స్టోక్స్ తన రెండో కౌంటీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగగానే.. ఓ భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌(England) కొత్త టెస్టు కెప్టెన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం కారణంగా అతను పిచ్‌పైనే పడిపోయాడు. అక్కడే పడిపోయాడు. ఆ సమయంలో అసలేం జరిగిందంటూ ప్రేక్షకులతోపాటు నెటిజన్లు కంగారుపడ్డారు. ఆ తర్వాత మాత్రం పరిస్థితి చూస్తే మాత్రం వేరేలా కనిపించింది.

Also Read: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత్.. 43 ఏళ్ల నిరీక్షణకు తెర..

డర్హామ్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో డర్హామ్ తొలుత బ్యాటింగ్ చేసింది. బెన్ స్టోక్స్ డర్హామ్‌లో భాగంగా ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్టోక్స్ పిచ్‌పైకి వచ్చాడు. అతను గ్లామోర్గాన్ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా బౌలర్ మార్నస్ లాబుస్‌చాగ్నే చేతిలో బాదితుడిగా మారాడు. బంతి విసిరిన వెంటనే భారీ షాట్ కోసం ప్రయత్నించిన బెన్‌స్టోక్స్ గురి తప్పడంతో వెంటనే కిందపడిపోయాడు.

ఇవి కూడా చదవండి

గాయం కారణంగా కింద పడిపోయిన స్టోక్స్..

బెన్ స్టోక్స్ పడిపోవడంతో కొందరు ఆటగాళ్లు కూడా అతని వద్దకు వెళ్లారు. అదృష్టవశాత్తూ ఏం కాలేదు. స్టోక్స్‌కు పెద్దగా గాయం కాలేదు.. ఆసమయంలో బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 33 పరుగులతో ఆడుతున్నాడు. నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల తట్టుకోలేక కిందపడిపోయాడు. ఆ వెంటనే కొద్దిసేపటికే లేచి మరలా బ్యాటింగ్ ప్రారంభించాడు. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత, బెన్ స్టోక్స్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించాడు. అతని వ్యక్తిగత స్కోరుతో పాటు జట్టు స్కోరు బోర్డుకు మరో 49 పరుగులు జోడించాడు. 150 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 110 బంతులు ఎదుర్కొని 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో, అతను డర్హామ్ తరపున అతని జట్టుకు అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

123 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 78 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ జట్టుకు రెండో భారీ స్కోరు అందించాడు. స్టోక్స్, పీటర్సన్ ఇన్నింగ్స్ ఫలితంగా డర్హామ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగలిగింది. దీంతో గ్లామోర్గాన్ జట్టు రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 31 పరుగులు చేసింది.

Also Read: IPL 2022 Points Table: టోర్ని నుంచి 2 జట్లు ఔట్‌.. మూడో బెర్త్‌ కోసం 7 జట్ల మధ్య గట్టి పోటీ..!

Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత్.. 43 ఏళ్ల నిరీక్షణకు తెర..