PAK vs ENG: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ రెండో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవాలంటే పాక్ జట్టు 157 పరుగులు చేయాల్సి ఉండగా, ఇంగ్లిష్ జట్టు సిరీస్, మ్యాచ్ గెలవాలంటే 6 వికెట్లు పడగొట్టాలి. మ్యాచ్ మూడవ రోజు, జేమ్స్ అండర్సన్ ప్రత్యేక బంతి గురించి ప్రస్తుతం నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది.
మూడో రోజు లంచ్ తర్వాత, జేమ్స్ ఆండర్సన్ ఓవర్ ప్రారంభించాడు. తన ఓవర్ ఐదో బంతికి పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను బౌల్డ్ చేశాడు. అండర్సన్ వేసిన ఈ బంతి చాలా అద్భుతంగా ఉంది. మహ్మద్ రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, బౌల్డ్ అయినా నమ్మలేక అలానే చూస్తుండిపోయాడు.
మ్యాచ్ మూడో రోజు లంచ్ తర్వాత మహ్మద్ రిజ్వాన్‌ను 16వ ఓవర్ ఐదో బంతికి ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బౌల్డ్ చేశాడు . అండర్సన్ వేసిన ఈ బాల్ ‘బాల్ ఆఫ్ ది ఇయర్’ అని అంటున్నారు. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అండర్సన్ ఈ బంతిని ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌లో ఉంచాడు. బంతి నేలను తాకిన తర్వాత, అది బ్యాట్ అంచు నుంచి స్వల్ప కదలికతో బయటకు వచ్చి ఆఫ్-స్టంప్‌ను ఢీకొట్టింది. అండర్సన్ వేసిన ఈ బంతిని చూసిన అభిమానులు ఇప్పుడు బాల్ ఆఫ్ ది ఇయర్ అని పిలుస్తున్నారు. అదే సమయంలో, ఈ బంతికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
The genius of James Anderson pic.twitter.com/EXaxSYh7Ul
— . (@paceandbounce_) December 11, 2022
ముల్తాన్ పిచ్‌పై ఇప్పటి వరకు బ్యాటింగ్ అంత ఈజీగా లేదు. అదే సమయంలో ఈ పిచ్‌పై అండర్సన్ వేసిన ఈ బంతిని చూసి అందరూ షాక్ అయ్యారు. చాలా మంది అనుభవజ్ఞులు కూడా అండర్సన్ ఈ బంతిని ప్రశంసించారు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేసింది. దీంతో పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా పాక్ జట్టు విజయానికి 157 పరుగులు చేయాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..