ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఎట్టకేలకు సాయి సుదర్శన్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అలాగే కరుణ్ నాయర్ 8 సంవత్సరాల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు.

ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే
Team India

Updated on: Jun 20, 2025 | 5:36 PM

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం (జూన్ 20)న ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్, భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి మ్యాచ్ లీడ్స్‌లోని చారిత్రాత్మక హెడింగ్లీ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్ సుదర్శన్ తన టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టగా, మరో సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ కూడా 8 సంవత్సరాల తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌లో, రెండు జట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించడానికి రెండు జట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లు ధరించారు. జాతీయ గీతానికి ముందు రెండు జట్లు రెండు నిమిషాల మౌనం పాటించాయి. జూన్ 12న, అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు.

జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణీకులలో 169 మంది భారతీయులు, బ్రిటన్, పోర్చుగల్ మరియు కెనడా పౌరులు ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 270 మందికి పైగా ఈ ఘోర ప్రమాదంలో మరణించారు. దీనికి సంతాప సూచకంగానే ఇరు జట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి

నల్లటి బ్యాండ్లతో ఇరు జట్ల ఆటగాళ్లు..

ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇలా.

టీమ్ ఇండియా:

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, పర్షిద్ కృష్ణ.

ఇంగ్లాండ్:

జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి