సెమీస్‌లో టీమిండియా సెన్సేషన్స్.. అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?
Duleep Trophy Live Streaming: సెంట్రల్ జోన్ vs ఈస్ట్ జోన్ మధ్య తొలి సెమీఫైనల్ ఆగస్టు 30న ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో నిర్వహించనున్నారు. రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్, నార్త్ జోన్ తలపడనున్నాయి.

Duleep Trophy Live Streaming: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి నాకౌట్ పోరులు మొదలుకానున్నాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్.. ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. మరో సెమీఫైనల్లో సౌత్ జోన్.. నార్త్ జోన్‌తో పోటీపడనుంది.
వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు..
ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల్లో తన బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఎర్ర బంతి క్రికెట్‌లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. వైభవ్ ఉపకెప్టెన్‌గా ఉన్నాడు. క్వార్టర్‌ఫైనల్లో నార్త్‌ఈస్ట్ జోన్‌పై ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ బ్యాట్‌తో కేవలం 8 పరుగులకే పరిమితమైనప్పటికీ.. బంతితో మాత్రం ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు వేసి 11 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..!
సెంట్రల్ జోన్ బలమైన జట్టు..
సెంట్రల్ జోన్‌కు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నాడు. రింకూ సింగ్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, సారంశ్ జైన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. గత ఏడాది టైటిల్ సాధించిన సెంట్రల్ జోన్.. మరోసారి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో వైభవ్, ఇషాన్ కిషన్, అభిమన్యు ఈశ్వరన్‌లతో కూడిన ఈస్ట్ జోన్ బ్యాటింగ్ విభాగానికి కఠిన పరీక్ష ఎదురుకానుంది.
మ్యాచ్ ఎప్పుడు?
సెంట్రల్ జోన్ vs ఈస్ట్ జోన్ మధ్య తొలి సెమీఫైనల్ ఆగస్టు 30న ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో నిర్వహించనున్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
టీవీలో ఎక్కడ చూడాలి?
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్‌ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వీక్షించొచ్చు. ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టెలివిజన్ కవరేజీ ఉంటుంది.
ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ?
మ్యాచ్‌ను మొబైల్ లేదా వెబ్‌లో చూడాలనుకునే అభిమానులకు జియోహాట్‌స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
మరో సెమీఫైనల్లో సౌత్ vs నార్త్..
రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్, నార్త్ జోన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా ఆగస్టు 30న ఉదయం 9:30 గంటలకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో ప్రారంభమవుతుంది. సౌత్ జోన్‌కు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నాడు.
ఫైనల్ ఎప్పుడు?
రెండు సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన జట్లు దులీప్ ట్రోఫీ ఫైనల్లో తలపడతాయి. తుది పోరు సెప్టెంబరు 6 నుంచి 10 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ వివరాలు ఒకే చోట..
మ్యాచ్: సెంట్రల్ జోన్ vs ఈస్ట్ జోన్
టోర్నీ: దులీప్ ట్రోఫీ 2026
దశ: తొలి సెమీఫైనల్
తేదీ: ఆగస్టు 30, 2026
సమయం: ఉదయం 9:30 గంటలు
వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బెంగళూరు
టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్
ప్రత్యేక ఆకర్షణ: వైభవ్ సూర్యవంశీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




