Video: మొన్న హెడ్.. నేడు లబూషేన్.. డీఎస్‌పీ సిరాజ్‌తో కుమ్ములాట.. సీన్ కట్ చేస్తే..

|

Dec 15, 2024 | 8:32 AM

అడిలైడ్ తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మహ్మద్ సిరాజ్ స్లెడ్డింగ్ కొనసాగుతోంది. అయితే ఈసారి మార్నస్ లాబుస్చాగ్నే బలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. సిరాజ్ మియా తగ్గేదేలే అంటూ ఆసీస్ ఆటగాళ్లపై కాలు దువ్వుతున్నాడు.

Video: మొన్న హెడ్.. నేడు లబూషేన్.. డీఎస్‌పీ సిరాజ్‌తో కుమ్ములాట.. సీన్ కట్ చేస్తే..
Siraj Switches Vs Labuschan
Follow us on

DSP Mohammed Siraj switches bails as Marnus Labuschange: అడిలైడ్ తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మహ్మద్ సిరాజ్ స్లెడ్డింగ్ కొనసాగుతోంది. మార్నస్ లాబుస్చాగ్నే అతనితో మరోసారి కయ్యానికి కాలు దువ్వాడు. ఈ క్రమంలో ఆ తర్వాత ఓవర్‌లోనే లాబుషాగ్నే వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

అడిలైడ్‌లో హెడ్‌ను పెవిలియన్ చేర్చిన సిరాజ్ మియా.. అతనితో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి చర్యలను కాలుదువ్విన సిరాజ్.. ఆస్ట్రేలియాకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నాడు.

 

గబ్బా టెస్టు రెండో రోజు తొలి సెషన్ భారత పేసర్ల పేరిట నిలిచింది. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా 76 పరుగులకే టాప్-3 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా తన తొలి స్పెల్‌లోనే ఖవాజా, మెక్‌స్వీనీని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మార్నస్ లాబుషాగ్నేను నితీశ్ రెడ్డి అవుట్ చేశాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ జోడీ పరుగుల వర్షం కురిపిస్తూ.. భారత్‌కు తలనొప్పిలా మారారు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు స్కోరు 104/3గా నిలిచింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..