Video: బౌలింగ్ చేసేందుకు సిద్ధమైన బౌలర్.. కట్‌చేస్తే.. మీదికి దూసుకొచ్చిన కుక్క.. ఆ తర్వాత ఏమైందంటే?
Cricket Viral Video: ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఇక గల్లీ మ్యాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాదు, గల్లీ క్రికెట్‌లోనూ ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వీటిని చూస్తే కాసేపు నవ్వుకోవాలనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Cricket Viral Video: ఫుట్‌బాల్ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడే క్రీడ క్రికెట్. ఈ క్రికెట్ గేమ్‌లో మైదానంలో చాలా సార్లు ఫన్నీ సంఘటనలు కనిపిస్తుంటాయి. ఓ కుక్క కారణంగా ఫాస్ట్ బౌలర్ బంతిని బౌల్ చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో అక్కడ జరిగిన సంఘటనతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం ఒక ఫాస్ట్ బౌలర్ తన రనప్ పూర్తి చేసిన తర్వాత బంతిని విసిరేందుకు రెడీ అయ్యాడు. అయితే, మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ కుక్క.. అతనిని కరిచేందుకు మీదికొచ్చింది. దీని కారణంగా బౌలర్ బంతిని కుక్క వైపు గట్టిగా విసిరేస్తాడు. అయినా, వెనక్కి తగ్గక పోవడంతో.. భయపడి అక్కడి నుంచి దూరంగా పారిపోతున్నట్లు వీడియోలో చూడొచ్చు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియలేదు. అభిమానులు మాత్రం ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు.
మీరు కూడా ఈ వీడియోను చూడండి:
— Out Of Context Cricket (@GemsOfCricket) November 25, 2023
అంతర్జాతీయ క్రికెట్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. అయితే, మూడో మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియా ఘన విజయంతో సిరీస్‌లోకి తిరిగొచ్చింది.
మరిన్ని క్రికెట్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..