Bumrah: ‘బుమ్రా.. ఐపీఎల్‌పై శ్రద్ధ, దేశం మీద లేదా.? గుడ్‌బై చెప్పేయ్’ ఫైరవుతున్న నెటిజన్లు..

|

Nov 01, 2022 | 5:49 PM

ఈ రెండు పర్యటనలకు ఎంపికైన జట్లలో జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం భారత క్రికెట్ ఫ్యాన్స్‌లో రకరకాల అనుమానాలను లేవనెత్తుతోంది.

Bumrah: బుమ్రా.. ఐపీఎల్‌పై శ్రద్ధ, దేశం మీద లేదా.? గుడ్‌బై చెప్పేయ్ ఫైరవుతున్న నెటిజన్లు..
Jasprit Bumrah
Follow us on

టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ఆడబోయే రెండు సిరీస్‌లకు బీసీసీఐ ఇటీవలే జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట నవంబర్ 18-30 కివీస్‌తో సిరీస్ జరగనుండగా.. ఆ తర్వాత డిసెంబర్ 4-26 బంగ్లాదేశ్‌తో టీమిండియా తలబడనుంది. ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా, వన్డేలకు శిఖర్ ధావన్ సారధిగా వ్యవహరించనున్నారు. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటనలో వన్డేలు, టెస్టులకు రోహిత్ శర్మే జట్టు పగ్గాలు చేపడతాడు. ఇదిలా ఉంటే.. ఈ రెండు పర్యటనలకు ఎంపికైన జట్లలో జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం భారత క్రికెట్ ఫ్యాన్స్‌లో రకరకాల అనుమానాలను లేవనెత్తుతోంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికా సిరీస్‌లో బుమ్రాకు గాయమైంది. నెలలు గడుస్తున్నా.. అప్పటి నుంచి ఇప్పటివరకు బుమ్రా ఇంకా జట్టులోకి తిరిగి పునరాగమనం ఇవ్వలేదు. ఎందుకని.? బుమ్రాకు దేశం కంటే ఐపీఎల్‌ ఎక్కువైపోయిందా.? లేక ఫిట్‌గా ఉన్నా బీసీసీఐ పరిగణలోకి తీసుకోవట్లేదా.? అనే డౌట్స్ అభిమానుల్లో వస్తున్నాయి.

ఈ 28 ఏళ్ల పేసర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి.. 6 ఏళ్లు అవుతోంది.. ఇప్పటిదాకా ఆడింది 30 టెస్ట్‌లు, 72 వన్డేలు, 56 టీ20లు మాత్రమే. మరోవైపు 2013లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలోనూ ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి ఎంత ఫాస్ట్‌గా వచ్చాడో.. అంతే ఫాస్ట్‌గా ఎగ్జిట్ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడానికి రెస్ట్ లేదా గాయం అంటున్నారు. మరి ఐపీఎల్‌కు మాత్రం ఇవేం కనిపించట్లేదు. అసలు బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే ఉద్దేశం ఉందా.? ఒకవేళ లేకపోతే గుడ్‌బై చెప్పి.. లీగ్ క్రికెట్ ఆడుకోవచ్చు కదా. జాతీయ జట్టులో నాణ్యమైన పేసర్ లేని లోటు కనిపిస్తుంటే.. బుమ్రాకు ఏం పట్టడం లేదా.? దేశం కంటే డబ్బే ముఖ్యమైతే ఎంచక్కా ఐపీఎల్ ఆడుకోవచ్చునని నెటిజన్లు విమర్శిస్తున్నారు.