Rishab Shetty: ఆ క్రికెటర్ అంటే పిచ్చి.. కాంతార హీరో ఫేవరేట్ ప్లేయర్ ఎవరో తెలుసా.?

Rishab Shetty Favourite Cricketer: నాకు క్రికెట్‌ అంటే పిచ్చి, చిన్నప్పుడు ఇంట్లో కన్నా క్రికెట్‌ మైదానంలోనే ఎక్కువగా గడిపేవాడినంటూ కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి తెలిపాడు. అలాగే, ఇప్పటికీ నా కారులో క్రికెట్‌ కిట్‌ ఉంటుందని, షూటింగ్‌ మధ్యలో విరామం దొరికితే సెట్‌లోనే ఆట మొదలెట్టేస్తానంటూ కుండ బద్దలుకొట్టారు.

Rishab Shetty: ఆ క్రికెటర్ అంటే పిచ్చి.. కాంతార హీరో ఫేవరేట్ ప్లేయర్ ఎవరో తెలుసా.?
Rishab Shetty Favorite Cricketer

Updated on: Oct 06, 2025 | 11:32 AM

Rishab Shetty Favourite Cricketer: ‘కాంతార’ (Kantara) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి క్రికెట్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన అభిమాన క్రికెటర్‌ గురించి, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాల గురించి పంచుకున్నారు. దీంతో రిషబ్ శెట్టి ఫేవరేట్ ప్లేయర్ ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆరా తీసుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రిషబ్ శెట్టి అభిమాన క్రికెటర్ ఎవరు?

రిషబ్ శెట్టికి అత్యంత ఇష్టమైన క్రికెటర్ సౌరభ్ గంగూలీ అని పలు సందర్భాల్లో తెలిపారు. ఆయన తన చిన్నతనంలో ఇంట్లో కంటే క్రికెట్ మైదానంలోనే ఎక్కువ సమయం గడిపేవారట. ఇప్పటికీ తన కారులో క్రికెట్ కిట్ ఎప్పుడూ ఉంటుందని, షూటింగ్ విరామ సమయాల్లో సెట్‌లోనే క్రికెట్ ఆడటం అలవాటుగా చెప్పుకొచ్చారు ఆయన.

సౌరభ్ గంగూలీ తనకు కేవలం అభిమాన క్రికెటర్ మాత్రమే కాదని, ఆయన తన హీరో అని రిషబ్ పేర్కొన్నారు. గంగూలీ నుంచే తాను క్రమశిక్షణ, కష్టపడేతత్వం వంటి విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. భారత క్రికెట్‌కు గంగూలీ అందించిన నాయకత్వం, ఆయన తెచ్చిన దూకుడు స్వభావం రిషబ్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయంట.

ఇవి కూడా చదవండి

రిషబ్ శెట్టికి క్రికెట్‌తో అనుబంధం..

చిన్ననాటి ఆట: రిషబ్ శెట్టి తన స్కూల్, కాలేజీ రోజుల్లో క్రికెట్‌ను చాలా ఉత్సాహంగా ఆడేవారట. సినిమా, క్రికెట్‌ రెండూ తనకి అత్యంత ఇష్టమైన అంశాలుగా పేర్కొన్నారు.

కాగా ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, సమయం దొరికితే వెంటనే ఆట మొదలుపెట్టడానికి వీలుగా ఆయన కారు డిక్కీలో ఎప్పుడూ క్రికెట్ కిట్ సిద్ధంగా ఉంచుకునేవారంట.

అలాగే, బెంగళూరు టీమ్ పేరు మార్పు సందర్భంగా, రిషబ్ శెట్టి ‘కాంతార’ శివ పాత్రను గుర్తుచేసేలా ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఒకటి గతంలో వైరల్ అయ్యింది. క్రికెట్‌పై తనకున్న ప్రేమతోనే తాను అంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఈ వీడియో చేయగలిగానని ఆయన చెప్పారు. ఈ వీడియోను ఆయన స్వగ్రామం కుందాపూర్‌లోని ఒక వరి పొలంలో కేవలం మూడు గంటల్లో చిత్రీకరించారట.

సినిమా రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ, జాతీయ అవార్డులు అందుకున్న రిషబ్ శెట్టి… క్రికెట్‌ పట్ల కూడా అదే అభిమానాన్ని, క్రమశిక్షణను చూపిస్తూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనకు సౌరభ్ గంగూలీ అంటే ఎంత అభిమానమో ఈ మాటల్లో స్పష్టమవుతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..