4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?

|

Dec 13, 2021 | 7:04 PM

విజయ్ హజారే ట్రోఫీలో ఇండియన్ ప్లేయర్స్ దుమ్ములేపుతున్నారు. ముఖ్యంగా చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్...

4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?
Chennai Super Kings
Follow us on

విజయ్ హజారే ట్రోఫీలో ఇండియన్ ప్లేయర్స్ దుమ్ములేపుతున్నారు. ముఖ్యంగా చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. 2021 ఐపీఎల్ నుంచి పరుగుల వర్షం కురిపిస్తున్న రుతురాజ్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోకి కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. రుతురాజ్ ఆటతీరును సీనియర్ ప్లేయర్స్ అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అందులో ఒకరు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్. రుతురాజ్ ఆటతీరు అద్భుతమన్న వెంగ్‌సర్కార్.. ఈకాలపు స్టైలిష్ బ్యాట్స్‌మెన్ అని.. దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే.. ఖచ్చితంగా జాతీయ జట్టులోకి వస్తాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర తరపున విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ వరుసగా 3 సెంచరీలు బాదేశాడు. ఈ 3 సెంచరీలతో, అతను 4 మ్యాచ్‌ల్లో 145 సగటుతో 435 పరుగులు చేశాడు. అత్యధికం 154 నాటౌట్. అంతేకాకుండా విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ అగ్రస్థానంలో నిలిచాడు.

రుతురాజ్‌ను ఎన్నుకోవాలి: వెంగ్‌సర్కార్

దిలీప్ వెంగ్‌సర్కార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “మీరు తప్పనిసరిగా ఓ బెస్ట్ ప్లేయర్‌ను ఎంచుకోవాలి. తనను తాను నిరూపించుకోవడానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? సెలెక్టర్లు రుతురాజ్‌ని ఎంపిక చేయడానికి ఇదే సరైన సమయం. “రుతురాజ్‌కి ఇప్పుడు 18 లేదా 19 ఏళ్లు కాదు. అతడికిప్పుడు 24 ఏళ్లు. అతను 3వ నంబర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. కాగా, రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే టీమ్ ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన విషయం విదితమే.