Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా.. క్రికెట్‌లో సత్తా చాటుతోన్న అమీర్‌.. కశ్మీర్ టీమ్‌కు కెప్టెన్‌గా..

|

Jan 12, 2024 | 10:13 AM

కశ్మీర్‌లోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ తన ఎనిమిదేళ్ల వయసులోనే రెండు చేతులను కోల్పోయాడు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం అతనిని దివ్యాంగుడిగా మార్చేసింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశకు లోనవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. అయితే అమీర్‌ హుస్సేన్‌ మాత్రం అలా చేయలేదు

Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా..  క్రికెట్‌లో సత్తా చాటుతోన్న అమీర్‌.. కశ్మీర్ టీమ్‌కు కెప్టెన్‌గా..
Amir Hussain Lone
Follow us on

అన్నీ ఉన్నా ఏమీ సాధించలేని ఈ కాలంలో చేతులు లేకపోయినా క్రికెట్ ఆడి యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు కశ్మీర్‌కు చెందిన దివ్యాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ . కశ్మీర్‌లోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ తన ఎనిమిదేళ్ల వయసులోనే రెండు చేతులను కోల్పోయాడు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం అతనిని దివ్యాంగుడిగా మార్చేసింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశకు లోనవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. అయితే అమీర్‌ హుస్సేన్‌ మాత్రం అలా చేయలేదు. రెండు చేతుల్లేకపోయినా క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అందులోనే కెరీర్‌ను వెతుక్కున్నాడు. ఇప్పుడు ఏకంగా జమ్మూ కశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను తీసుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడీ యంగ్ క్రికెటర్‌. 2013లో అమీర్ తన కాళ్లను ఉపయోగించి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అలాగే మెడ, భుజాల మధ్యలో బ్యాట్‌ పెట్టుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేశాడు. షార్జాలో జరుగుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ప్రీమియర్ లీగ్‌లోనూ పాల్గొని సత్తా చాటాడు.

అమీర్ హుస్సేన్ లోన్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని అభినందిస్తూ ముంబైకి చెందిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ‘పికిల్ ఎంటర్‌టైన్‌మెంట్’ అమీర్ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. అమీర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను బిగ్ బ్యాట్ ఫిలింస్ నిర్మిస్తుండగా, దీనికి మహేష్ వి భట్ దర్శకత్వం వహించనున్నారు. ఈ బయోపిక్‌లో అమీర్ హుస్సేన్ లోన్ పాత్రను పోషించాలనుకుంటున్నట్లు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తెలిపారు. త్వరలోనే ఈ బయోపిక్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..