Team India: టీ20 ప్రపంచ‌కప్ ఎఫెక్ట్.. భారత జట్టులో కీలక మార్పులు.. జనవరి నుంచే అమలు.. అవేంటంటే?

|

Nov 14, 2022 | 7:40 PM

IND vs SL: టీ20 ప్రపంచకప్-2022 సెమీ-ఫైనల్స్‌లో టీమ్ ఇండియా గెలవలేక, టోర్నమెంట్ నుంచి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

Team India: టీ20 ప్రపంచ‌కప్ ఎఫెక్ట్.. భారత జట్టులో కీలక మార్పులు.. జనవరి నుంచే అమలు.. అవేంటంటే?
Team India Vs Sri Lanka
Follow us on

భారత క్రికెట్ జట్టు ముఖ్యమైన పోటీదారుగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లోకి ప్రవేశించింది. కానీ, అభిమానుల ఆశలను నెరవేర్చలేక, సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టోర్నమెంట్ అంతటా భారత్ బాగానే ఆడింది. అయితే, రోహిత్ సేన కీలక సందర్భాలలో మాత్రం ఘోరంగా విఫలమైంది. అందుకే టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత బీసీసీఐ పలు మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20లో చాలా మంది ఆటగాళ్లకు శాశ్వతంగా విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. పరిమిత ఓవర్లలో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో వన్డే కెప్టెన్, టీ20 కెప్టెన్ వేర్వేరుగా ఉండనున్నారు. వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించనున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి, అవకాశం వచ్చినప్పుడు భారత జట్టు కమాండ్‌ని కూడా హ్యాండిల్ చేసిన హార్దిక్ పాండ్యాకు టీ20 కమాండ్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

జనవరి నుంచి కీలక మార్పులు..

InsideSport నివేదిక ప్రకారం, వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరిలో భారత్‌-శ్రీలంక మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో వన్డే జట్టు కమాండ్‌ రోహిత్‌కు, టీ20 జట్టు కమాండ్‌ పాండ్యాకు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. BCCI ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, “దీనిని ధృవీకరించడం చాలా తొందరగా ఉంటుంది. అయితే వన్డేలు, టీ20లకు వేర్వేరు కెప్టెన్‌లను కలిగి ఉండటం సరైనదేనా అని మేం పరిశీలిస్తున్నాం. ఇది ఒక వ్యక్తిపై భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20కి కొత్త విధానం, అదే సమయంలో స్థిరత్వం అవసరం. ఈ ప్లాన్‌ను జనవరి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సీనియర్లకు ఇకపై సెలవులేనా?

టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ నిష్క్రమణ తర్వాత, చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20 నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడని తెలుస్తోంది. అతడితో పాటు విరాట్ కోహ్లీ పేరు కూడా చర్చనీయాంశమైంది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ పేర్లు ఫిక్స్ అయ్యాయి. వీరిద్దరూ ఇప్పుడు చాలా అరుదుగా భారత్ తరపున టీ20 ఆడుతున్నారు. కాగా, టీ20 ప్రపంచకప్‌ 2022లో కార్తీక్‌ను మ్యాచ్ ఫినిషర్‌గా టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అయితే, కార్తీక్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో ప్రపంచ కప్ తర్వాత కొత్త ఫినిషర్‌ను సిద్ధం చేయడంపై జట్టు దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..