Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి?

Watch: గాలే టెస్టులో ధ్రువ్ జురెల్ పట్టిన క్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. లాహిరు ఉదార క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతి నేలను తాకిందా లేదా అనే అంశంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు నాలుగో రోజు ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది.

Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి?
Ind Vs Sl

Updated on: Aug 19, 2026 | 8:32 AM

Watch: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ పట్టిన ఒక వివాదాస్పద క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ రాజేస్తోంది. లంక బ్యాటర్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. టీ బ్రేక్ తర్వాత లంక ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 22వ ఓవర్లో అసలు వివాదం మొదలైంది. భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన నాలుగో బంతిని లంక బ్యాటర్ లాహిరు ఉదార డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ బయటి అంచుని తాకుతూ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ వైపు వేగంగా దూసుకెళ్లింది.

సోషల్ మీడియాలో తీవ్ర వివాదం

జురెల్ నేలకి అత్యంత సమీపంలో బంతిని అందుకోవడంతో భారత్ గట్టిగా అపీల్ చేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు మైదానంలో నిర్ణయం చెప్పకుండా థర్డ్ అంపైర్‌కు రీప్లే నివేదించారు. జూమ్ చేసి చూసిన రీప్లేలో బంతి నేలను తాకినట్లు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, థర్డ్ అంపైర్ దానికి అవుట్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటన రాగానే మైదానంలో భారత్ సంబరాలు చేసుకోగా, లంక అభిమానులు నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ క్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది టెక్నాలజీ వైఫల్యమని, శ్రీలంకకు అన్యాయం జరిగిందని కొంతమంది వాదిస్తుండగా అది పక్కా క్యాచ్ అని భారత అభిమానులు సమర్థిస్తున్నారు.

ఇది కూడా చదవండి: IND vs SL: టీమిండియాది చెత్త ప్లానింగ్‌ అంటూ కామెంటర్ ఫైర్.. గాలే టెస్ట్‌లో భారత్ చేసిన తప్పు అదేనా?

 

విజయం వైపు భారత్ అడుగులు

ఈ వివాదం పక్కన పెడితే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి లంకకు ఇంకా 288 పరుగులు కావాలి. టీమిండియా సిరీస్‌లో శుభారంభం చేయడానికి మరో 6 వికెట్లు పడగొడితే సరిపోతుంది. బౌలింగ్‌లో మానవ్ సుతార్, ఇతర స్పిన్నర్లు లంక ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.

ఇది కూడా చదవండి: IND vs SL: ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

అడ్డంకిగా మారనున్న వర్షం ముప్పు

ఐదో రోజు భారత విజయానికి వాతావరణం పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా గాళ్ మైదానంలో వర్షం మ్యాచ్‌ను నిరంతరం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఒకవేళ ఆఖరి రోజు కూడా భారీ వర్షం కురిస్తే మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసే ప్రమాదం ఉంది. వాతావరణం సహకరిస్తే తొలి సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించాలని భారత్ పట్టుదలతో ఉంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us