
మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ వస్తే చాలు మారుమోగిపోయే పేరు. టీమిండియా కెప్టెన్‌గా ఎంతో ఘనత సాధించిన ధోని, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. తన అభిమానుల కోసమే ఐపీఎల్‌లో ఆడుతున్న ధోని.. ఈ సీజన్‌లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ధోని కోసమే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు చూసులు చూసే వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. ధోని అంటే పడి చచ్చే వాళ్లు లక్షల్లో ఉంటారు. ధోని బ్యాటింగ్ చూసేందుకు సీఎస్‌కే బ్యాటర్లు అవుట్ అవ్వాలని కూడా కోరుకునేంత పిచ్చి వాళ్లది.
టీమ్ ఓడిపోయినా పర్వాలేదు.. ధోని బాగా ఆడితే చాలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ధోని ఆడితే చూసి అంతలా ఆనందిస్తారు. అలాంటి వాళ్లు ధోని అవుట్ అయితే ఊరుకుంటారా? ధోనిని అవుట్ చేసిన వాళ్లను చూస్తే తట్టుకోగలరా? ఎస్.. అస్సలు తట్టుకోలేరు. ధోని అవుట్ అయితే ధోని అభిమానులు ప్రాణాలు పోయినంతగా ఫీల్ అవుతారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ కూడా అలానే రియాక్ట్ అయింది. ఎంతలా అంటే.. ధోని కొట్టిన బాల్‌ను క్యాచ్ అందుకున్న ప్లేయర్‌ను పీక పిసికి చంపేసేంత కోపం చూపించింది.
మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. సందీప్ శర్మ బౌలింగ్‌లో ధోని ఓ భారీ సిక్స్‌కు ప్రయత్నించాడు. కానీ, డీప్ మిడ్ వికెట్‌లో హెట్మేయర్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ధోని 10 బంతుల్లో 16 పరుగులు ఔటయ్యాడు. ఆ సమయంలో ఓ లేడీ ఫ్యాన్.. చేయి ముందుకు చాచి, క్యాచ్ పట్టిన హెట్మేయర్‌ను పిసికి చంపేసేంత కోపం ప్రదర్శించింది. ఈ వీడియోను కింద మీరూ చూడొచ్చు..
Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK
— Cricketism (@MidnightMusinng) March 30, 2025
Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W
— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..