చెన్నై ‘సిక్సర్’

|

Apr 12, 2019 | 2:01 PM

ఉత్కంఠ పోరులో రాయల్స్‌పై విజయం  మెరిసిన రాయుడు, ధోని  కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ధోనికి వందో విజయం చెన్నై: జైపూర్ వేదికగా రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. గురువారం మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (28; 26 బంతుల్లో 1×4, 0×6) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చెన్నై బౌలర్లలో చాహర్, ఠాకూర్, జడేజా రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్‌ […]

చెన్నై సిక్సర్
Follow us on
  • ఉత్కంఠ పోరులో రాయల్స్‌పై విజయం 
  • మెరిసిన రాయుడు, ధోని 
  • కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ధోనికి వందో విజయం

చెన్నై: జైపూర్ వేదికగా రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. గురువారం మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (28; 26 బంతుల్లో 1×4, 0×6) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చెన్నై బౌలర్లలో చాహర్, ఠాకూర్, జడేజా రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు రాయుడు (57; 47 బంతుల్లో 2×4, 3×6), ధోని (58; 43 బంతుల్లో 2×4, 3×6) చక్కటి ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించారు. దీనితో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సూపర్‌కింగ్స్‌ విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం కావడం విశేషం.