IND vs AUS: విరాట్ కోహ్లీని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంట..! ఈ మేరకు విరాట్ కోహ్లీ స్వస్థలమైన ఢిల్లీ పోలీసులు భయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటి, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం ఏంటి, ఢిల్లీ పోలీసులు భయపడడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం తెలిస్తే మాత్రం నవ్వుకుంటారు. గత ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు మాజీ కెప్టెన్ మూడేళ్ల తర్వాత టెస్ట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. డబుల్ సెంచరీ చేస్తాడని ఊహించినా.. ఆ కల నెరవేరలేదు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ 186 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 75వ సెంచరీ. 28వ టెస్టు సెంచరీ. 2019 తర్వాత 1205 రోజుల నిరీక్షణ, 24 టెస్టులు, 42 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ సాధించాడు. కేవలం 14 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయింది. అయితే, ఆ రోజు విరాట్ అనారోగ్యంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్లు ఆయన భార్య అనుష్క ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా కొంత వివాదం నడించింది.
ఈ క్రమంలో నెటిజన్లకు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ చేశారు. “డియర్ గుజరాత్ పోలీసులు. విదేశీ అతిథులను చితక్కొట్టినందుకు మా ఇంటి అబ్బాయి విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ విదేశీయులు అంటే ఆస్ట్రేలియా జట్టు. ఇక చితక్కొట్టడం అంటే బ్యాట్‌తో ఆసీస్ బౌలర్లపై పరుగుల వర్షం కురిపించడం అన్నమాట. ఈ ట్వీట్‌ను ఢిల్లీ పోలీసులు సరదాగా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఢిల్లీ పోలీసుల పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Dear @GujaratPolice,
Don’t book our Delhi boy #ViratKohli for voluntarily causing hurt to the guests.
AUS-SOME, game @imVkohli!#INDvAUS #BGT2023 pic.twitter.com/weg4wstnhO
— Delhi Police (@DelhiPolice) March 12, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..