Corona In IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వణికిస్తున్న కరోనా.. తాజాగా మరొకరికి కరోనా పాజిటివ్..
ఐపీఎల్ 2022(IPL 2022)లో కరోనా క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)లో ముగ్గురు సభ్యులు కరోనా(Corona) పాజిటివ్‌గా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి...
ఐపీఎల్ 2022(IPL 2022)లో కరోనా క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)లో ముగ్గురు సభ్యులు కరోనా(Corona) పాజిటివ్‌గా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అందులో ఒక విదేశీ ఆటగాడికి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం అతనికి కరోనా లేదని తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విదేశీ ఆటగాడు మిచెల్ మార్ష్‌కు యాంటిజెన్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే, దీని తర్వాత అతనికి ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. మార్ష్ ఈ సీజన్‌లోని ఇప్పటి వరకు ఒకటే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌లో రెండు కరోనా కేసులు ఉన్నాయి. ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్‌తో పాటు, కోచింగ్ సిబ్బందిలోని మరొక సభ్యుడు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చెప్పారు.
ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం పూణె వెళ్లాల్సి ఉండగా కోవిడ్ కేసుల కారణంగా వెళ్లలేదు. ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. పూణెకు జట్టు ఎప్పుడు బయల్దేరుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఢిల్లీ జట్టుకు సంబంధించి మొదటగా ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్ కరోనా సోకింది. ఏప్రిల్ 15 శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్ కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్లు ప్రకటించారు. పాట్రిక్ ఫర్‌హార్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లందరితో టచ్‌లో ఉన్నాడు. దీంతో ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్ష చేశారు. తాజాగా కోచింగ్ సిబ్బందిలోని మరొక సభ్యుడు కరోనా సోకింది.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఢిల్లీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. ఢిల్లీ తన నాలుగో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఆ తర్వాత బెంగళూరు చేతిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
Read Also.. Shashi Tharoor: ఆ బౌలర్ స్పీడుకు శశిథరూర్ ఫిదా.. త్వరగా టీమిండియాలోకి తీసుకోవాలంటూ ట్వీట్..