1077 రోజుల తర్వాత లక్కీ ఛాన్స్.. 20 బంతుల్లో ముంబైకి మెంటలెక్కించిన సెంచరీల సుల్తాన్

Karun Nair Hits 1st IPL Fifty after 7 Years: ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌ కరుణ్ నాయర్ 1077 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అంటే కరుణ్ నాయర్‌ 2022 తర్వాత తన తొలి IPL క్యాప్‌ను అందుకున్నాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ చివరిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.

1077 రోజుల తర్వాత లక్కీ ఛాన్స్.. 20 బంతుల్లో ముంబైకి మెంటలెక్కించిన సెంచరీల సుల్తాన్
Delhi Capitals Vs Mumbai Indians, Karun Nair

Updated on: Apr 13, 2025 | 10:41 PM

Karun Nair Hits 1st IPL Fifty after 7 Years: ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌ కరుణ్ నాయర్ 1077 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అంటే కరుణ్ నాయర్‌ 2022 తర్వాత తన తొలి IPL క్యాప్‌ను అందుకున్నాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఆ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.

2024/25లో దేశీయ సీజన్‌లో సెంచరీల వర్షం కురిపించిన కరుణ్ నాయర్‌ను 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో నాయర్ ఆరు ఇన్నింగ్స్‌లలో 177 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ హజారే ట్రోఫీలో కూడా కరుణ్ నాయర్ ఆకట్టుకున్నాడు. అక్కడ అతను ఐదు ఇన్నింగ్స్‌లలో అజేయంగా 542 పరుగులు సాధించాడు.

కేఎల్ రాహుల్‌ను ముందు పంపించే అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఉంది. కానీ, కరుణ్ నాయర్‌కు ఛాన్స్ ఇచ్చింది. 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడుతోన్న కరుణ్ నాయర్ ఎంతో పట్టుదలతో కనిపించాడు. కరుణ్ నాయర్ ఊచకోతకు ఎంఐ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కూడా తలవంచక తప్పలేదు.

పవర్ ప్లే చివరి బంతికి కరుణ్ నాయర్ 2 పరుగులు పూర్తి చేసి 22 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో కరుణ్ నాయర్ రీఎంట్రీకి ఛాన్స్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని కరుణ్ నాయర్ ఎంతో చక్కగా ఉపయోగించుకున్నాడు.

89 పరుగులు చేసి పెవిలియన్ చేరిన కరుణ్..

12వ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్ నాలుగో బంతికి కరుణ్ నాయర్‌ను మిచెల్ సాంట్నర్ బౌల్డ్ చేశాడు. నాయర్ 89 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..