AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడింది 2 మ్యాచ్‌లు, చేసింది 13 పరుగులు.. సీన్ కట్ చేస్తే.. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో సునామీ..

అతడికి అంతర్జాతీయ అనుభం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడింది కేవలం 2 మ్యాచ్‌లు.. చేసింది 13 పరుగులు..

ఆడింది 2 మ్యాచ్‌లు, చేసింది 13 పరుగులు.. సీన్ కట్ చేస్తే.. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో సునామీ..
Cricket
Ravi Kiran
|

Updated on: Dec 22, 2022 | 12:54 PM

Share

అతడికి అంతర్జాతీయ అనుభం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడింది కేవలం 2 మ్యాచ్‌లు.. చేసింది 13 పరుగులు. మొదటి అవకాశం ఇచ్చింది మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. సీన్ కట్ చేస్తే.. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడెవరో కాదు ధృవ్ షోరే. రంజీ ట్రోఫీలో భారత దేశవాళీ బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నారు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ధృవ్ షోరే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఈ స్కోర్‌లో ధృవ్ షోరే ఒక్కడే 252 పరుగులు చేశాడు.

315 బంతులు ఎదుర్కున్న ధృవ్ షోరే తన ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చివరి వరకు అజేయంగా నిలిచి అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మరోవైపు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్‌ బరిలోకి దిగాడు. ఇక ఐపీఎల్‌లో ధృవ్ షోరే కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018 సీజన్‌లో ఒక మ్యాచ్, 2019లో రెండో మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏదీ కూడా ధృవ్ షోరేపై ఆసక్తి చూపించకపోగా.. ఇప్పుడు డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు.

Follow Us
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
ఇలా చేస్తే రూ.500కు గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం నుంచి ప్రకటన..
ఇలా చేస్తే రూ.500కు గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం నుంచి ప్రకటన..
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. మధ్యాహ్నం 2 గంటలకే ఫలితాలు!
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. మధ్యాహ్నం 2 గంటలకే ఫలితాలు!
IND vs NZ: 246 పరుగులకు భారత్ ఆలౌట్..!
IND vs NZ: 246 పరుగులకు భారత్ ఆలౌట్..!
ఉదయాన్నే 2 లవంగాలు నమిలితే ఏమవుతుంది? జీర్ణక్రియ, కాలేయం, షుగర్‌!
ఉదయాన్నే 2 లవంగాలు నమిలితే ఏమవుతుంది? జీర్ణక్రియ, కాలేయం, షుగర్‌!