DC vs LSG Match Highlights, IPL 2022: పోరాడిన ఓడిన ఢిల్లీ.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న లక్నో..

Narender Vaitla

|

Updated on: May 01, 2022 | 7:57 PM

Delhi Capitals vs Lucknow Super Giants Live Score in telugu: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు సాధించారు.

DC vs LSG Match Highlights, IPL 2022: పోరాడిన ఓడిన ఢిల్లీ.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న లక్నో..
Dc Vs Lsg

Delhi Capitals vs Lucknow Super Giants Match Highlights in telugu: గెలుపు అనివార్యమైన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయం మూటగట్టుకుంది. వరుస విజయాలతో ఊపుతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ తమ ఖాతాలో ఏడో విజయాన్ని వేసుకుంది. ఆరు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో ఇచ్చిన 196 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు తొలి నుంచి తడబడ్డారు. పృథ్వీషా (5), డేవిడ్ వార్నర్‌ (3) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బతగిలింది.

ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (37), రిషబ్‌ పంత్‌ (44) పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనిలో పడ్డారు. అయితే వీరిద్దరూ వరుసగా పెవిలియన్‌ బాటపట్టడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లోకి జారుకుంది. పావెల్‌ (35), అక్సర్‌ పటేల్‌ (42*) పరుగులతో రాణించినా చివరికి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. లక్నో బౌలర్స్‌లో మొహ్సిన్‌ ఖాన్‌ 4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. తర్వాత దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్‌, గౌతమ్‌ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు సాధించారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 51 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. రాహుల్‌కు తోడుగా దీపక్‌ హుడా కూడా 52 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించడంతో లక్నో మంచి స్కోరును అందుకోగలిగింది. ఈ విజయంతో లక్నో తన ఖాతాలో 7వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి ఎగబాకింది.

Key Events

బలంగా లక్నో..

లక్నో సూపర్‌ జెయింట్స్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ రాహుల్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

ఢిల్లీకి విజయం అనివార్యం..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్‌ గెలవాల్సిందే

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 01 May 2022 07:44 PM (IST)

    లక్నో విజయం..

    లక్నో సూపర్ జెయింట్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు పరుగుల తేడాతో గెలిచింది. చివరికి పోరాడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరగులు చేసింది.

  • 01 May 2022 07:15 PM (IST)

    ఏడో వికెట్ డౌన్‌..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది. మొహ్సిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కృనల్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌ బాటపట్టాడు.

  • 01 May 2022 06:52 PM (IST)

    పంత్‌ అవుట్‌..

    30 బంతుల్లో 44 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ను పెంచే పనిలో పడ్డ రిషబ్‌ పంత్‌ వెనుదిరిగాడు. మొహ్సిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పంత్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 01 May 2022 06:43 PM (IST)

    వంద పరుగుల మార్క్‌ను దాటేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్‌ 100 పరుగులను దాటేసింది. వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడ్డ జట్టును రిషబ్‌ పంత్‌ ఆదుకునే పనిలో పడ్డాడు. కేవలం 26 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను పెంచుతున్నాడు. ఇక రోవ్‌మన్‌ పావెల్‌కు దంచి కొడుతున్నాడు. వరుస బౌండరీలతో చెలరేగుతున్నాడు. కేవలం 11 బంతుల్లోనే 22 పరుగులు సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ స్కోర్‌ 113 పరగులు వద్ద కొనసాగుతోంది. క్రీజులో పంత్‌ (43), పావెల్‌ (22) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 01 May 2022 06:28 PM (IST)

    కష్టాల్లోకి ఢిల్లీ క్యాపిటల్స్‌..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ కష్టాల్లోకి కూరుకుపోతోంది. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన లలిత్‌ యాదవ్‌ పెవిలియన బాట పట్టాడు.

  • 01 May 2022 06:20 PM (IST)

    మరో వికెట్‌..

    స్వల్ప పరుగుల వ్యవధిలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 20 బంతుల్లో 37 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ పెంచుతున్నట్లు కనిపించిన మిచెల్‌ మార్ష్‌ అవుట్‌ అయ్యాడు. గౌతమ్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 01 May 2022 05:55 PM (IST)

    బిగ్ వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. పృథ్వీషా అవుట్‌ అయిన కాసేపటికే డేవిడ్‌ వార్నర్‌ వెనుదిరిగాడు. మొహ్సిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఆయుష్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 01 May 2022 05:47 PM (IST)

    తొలి వికెట్‌ డౌన్‌..

    196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలిగింది. 5 పరుగుల స్వల్ప స్కోరుకే పృథ్వీషా అవుట్‌ అయ్యాడు. దుష్మంతా చమీరా బౌలింగ్‌లో గౌతమ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ 2 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 01 May 2022 05:21 PM (IST)

    ఢిల్లీ లక్ష్యం ఎంతంటే..

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు సాధించారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 51 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. రాహుల్‌కు తోడుగా దీపక్‌ హుడా కూడా 52 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించడంతో లక్నో మంచి స్కోరును అందుకోగలిగింది.

  • 01 May 2022 05:13 PM (IST)

    రాహుల్‌ స్పీడ్‌కు బ్రేక్‌ వేసిన శార్దూల్‌..

    జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించిన కేఎల్‌ రాహుల్ అవుట్ అయ్యాడు. 51 బంతుల్లోనే 77 పరగులు చేసి శార్దూల్‌ బౌలింగ్‌లో లిలిత్ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

  • 01 May 2022 05:07 PM (IST)

    దంచి కొడుతోన్న కేఎల్‌ రాహుల్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్‌ భారీ దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ దంచికొడుతున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 70 పరగులు చేశాడు. లక్నో 18 ఓవర్లు ముగిసే సమయానికి 167 పరగుల వద్ద కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేసిన రాహుల్‌ మరో సెంచరీ చేస్తాడో చూడాలి.

  • 01 May 2022 04:46 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో..

    కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు సాధించి జట్టు స్కోరును పరగులు పెట్టించిన దీపక్‌ హుడా అవుట్‌ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చిన దీపక్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం లక్నో స్కోర్‌ రెండు వికెట్ల నష్టానికి 137 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 01 May 2022 04:41 PM (IST)

    రాహుల్‌ జోరుకు తోడైన దీపక్‌ హుడా..

    కేఎల్ రాహుల్‌ జోరుకు దీపక్‌ హుడా కూడా తోడయ్యాడు. చాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ కేవలం 32 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు దీపక్‌.

  • 01 May 2022 04:37 PM (IST)

    దుమ్మురేపుతోన్న కేఎల్‌ రాహుల్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ మరోసారి కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌తో రాణిస్తున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లక్నో స్కోర్ 13 ఓవర్లు ముగిసే సమయానికి 129 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (50), దీపక్‌ హుడా (48) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 01 May 2022 04:31 PM (IST)

    దూసుకు పోతున్న లక్నో స్కోర్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెడుతోంది. దీపక్‌ హుడా, కేఎల్‌ రాహుల్‌ జట్టు స్కోర్‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్‌ సెంచరీకి చేరువయ్యారు. వీరిద్దరి భాగస్వామ్యం కేవలం 47 బంతుల్లోనే 76 పరుగులు సాధించారు.

  • 01 May 2022 03:55 PM (IST)

    తొలి వికెట్‌ డౌన్‌..

    9 రన్‌రేట్‌తో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌ వేగానికి బ్రేకులు వేసింది ఢిల్లీ. తొలి వికెట్ రూపంలో డికాక్‌ వెనుదిరిగాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. డికాక్‌ కేవలం 13 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు.

  • 01 May 2022 03:51 PM (IST)

    లక్నోకు శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు..

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ మొదలు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోకుండా 41 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (15), డికాక్‌ (23) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 01 May 2022 03:04 PM (IST)

    టాస్‌ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌..

    టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. పిచ్‌ కండిషన్స్‌ తొలుత బ్యాటింగ్ చేసిన వారికే అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో కెప్టెన్ రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి రాహుల్‌ తీసుకున్న ఈ నిర్ణయం లక్నోకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

Published On - May 01,2022 2:46 PM

Follow us
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..