ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను చీల్చి చెండాడే ఈ స్టార్ ఆటగాడికి ఆస్ట్రేలియాలోనే కాదు ఇండియాలోనూ బోలెడు అభిమానులున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నాడు. కేవలం ఆటతోనే కాదు తెలుగు పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ధనాధన్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు వార్నర్ మామ. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన వార్నర్‌ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించారు. అంతకుముందు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో స్టీవ్ స్మిత్‌తో పాటు కొన్నేళ్ల పాటు ఆసీస్ జట్టులో ఆడకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఈక్రమంలో వార్నర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడని, ఒకానొక దశలో నరకం చూశాడని అతని సతీమణి క్యాండీస్ ఆవేదన వ్యక్తం చేసింది. 2018 లో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్ ఉదంతం అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో అప్పటి కెప్టెన్ స్మిత్‌తో పాటు డేవిడ్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. దీనిపై స్పందించిన క్యాండీస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర పన్నిందని ఆరోపణలు చేసింది.
‘బాల్ టాంపరింగ్ సమయంలో వార్నర్‌తో పాటు మేం నరకం చూశాం. దక్షిణాఫ్రికాలో మే హోటల్ రూమ్ నుంచి బయటకు రాగానే వార్నర్‌ని శాశ్వతంగా తప్పించేందుకు కుట్ర జరిగింది. అప్పుడు మాకు ఏ ఒక్కరి దగ్గర నుండి మద్దతు లభించలేదు. అప్పటికే మానసికంగా ఇబ్బందిపడుతున్న మాకు ఎవరూ సహాయం చేయకపోవడంతో వార్నర్ మరింతగా కుంగిపోయాడు. సాయం చేయకపోగా వార్నర్ ని జట్టులోకి రానీయకుండా చేయాల్సిందంతా చేశారు. ప్రతి విషయానికి మమ్మల్ని నిందించారు. అయితే మా దగ్గరి బంధువులు ఈ విషయంలో మాకు అండగా నిలిచారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. దీంతో మేం ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాం. ఈ సమయంలోనే నాకు గర్భస్రావం జరిగింది. వార్నర్ ని జట్టులో నుంచి తొలగించి మరో ఆటగాడిని తీసుకున్నారు. కానీ వార్నర్ మళ్లీ ఫామ్ అందుకొని జట్టులోకి అడుగుపెట్టాడు. జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్ డోనాల్డ్ వచ్చాక జట్టులో చాలా మార్పులు వచ్చాయి. వారు వార్నర్ కి అండగా నిలిచారు’ అని వార్నర్ సతీమణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..