Video: ఒక్క బంతికి 15 పరుగులు.. సచిన్, ద్రావిడ్‌లను బెంబేలెత్తించాడు.. కట్ చేస్తే.. ఖాతాలో చెత్త రికార్డు

ఓ బౌలర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదలుపెట్టాడంటే.. కచ్చితంగా ఆరు పరుగులు లేదా ఒక ఎనిమిది పరుగులు ఇవ్వడం మీరు చూసి ఉంటారు. అయితే ఇక్కడ ఓ బౌలర్ ఏకంగా 15 పరుగులు తొలి బంతికే ఇచ్చాడు. షాక్ అవ్వకండి.. ఓ సారి వీడియో చూసేయండి.

Video: ఒక్క బంతికి 15 పరుగులు.. సచిన్, ద్రావిడ్‌లను బెంబేలెత్తించాడు.. కట్ చేస్తే.. ఖాతాలో చెత్త రికార్డు
Daryl Tuffey

Updated on: Jan 18, 2026 | 8:35 AM

2005లో న్యూజిలాండ్ బౌలర్ డారెల్ టఫీ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డును సృష్టించాడు. మొదటి ఓవర్ మొదటి లీగల్ బంతికే 15 పరుగులు ఇచ్చాడు. నాలుగు నో-బాల్స్(ఒక ఫోర్‌తో), రెండు వైడ్‌లు, మొదటి లీగల్ బంతికి ఫోర్, ఆపై మరో వైడ్ వేసి ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇదొక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ చరిత్రలో ఓ బౌలర్ మ్యాచ్ ప్రారంభించిన వెంటనే మొదటి బంతికే పద్నాలుగు లేదా పదిహేను పరుగులు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? 2005వ సంవత్సరంలో ఇలాంటి అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ డారెల్ టఫీ, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన మొదటి ఓవర్ మొదటి లీగల్ బంతికే ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు.

మరి దాని గురించి మాట్లాడుకుంటే.. ఆ మ్యాచ్ మొదటి ఓవర్ ప్రారంభించిన టఫీ తన మొదటి నాలుగు బంతులను నో-బాల్స్‌గా వేశాడు. ఈ నో-బాల్స్‌లో ఒక బంతిని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గిల్ క్రిస్ట్ బౌండరీగా మలిచాడు. నాలుగు నో-బాల్స్ తర్వాత టఫీ రెండు వైడ్ బాల్స్ వేశాడు. దీంతో ఒక్క లీగల్ బాల్ కూడా పడకుండానే ఆస్ట్రేలియా స్కోర్ 10 పరుగులు చేరింది. ఇక ఆ తర్వాత టఫీ వేసిన మొదటి లీగల్ బంతికి గిల్ క్రిస్ట్ మళ్లీ బౌండరీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 14కి చేరింది. అయితే ఈ మొదటి లీగల్ బాల్ తర్వాత కూడా టఫీ ఇంకో వైడ్ బాల్ వేశాడు. ఫలితంగా, మొదటి ఓవర్ మొదటి లీగల్ బంతి పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా స్కోర్ 15 పరుగులు దాటింది. క్రికెట్‌లో ఒక బౌలర్‌కు ఇంతకంటే దారుణమైన స్పెల్ ఉండదేమో. అయితే ఇది 2005లో జరగ్గా.. ఇప్పుడు దాదాపుగా 21 ఏళ్లు అయింది. ఈ టైం ఫ్రేంలో ఇంకొంతమంది బౌలర్లు ఇలాంటి చెత్త ప్రదర్శన చేశారు. మరి లేట్ ఎందుకు ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి.

ఇవి కూడా చదవండి