CSK vs RCB: హాఫ్ సెంచరీతో ఒకరు.. 275 స్ట్రైక్ రేట్‌తో మరొకరు.. చెన్నైపై ఆర్‌సీబీ బ్యాటర్ల ఊచకోత

|

Mar 28, 2025 | 9:24 PM

Chennai Super Kings vs Royal Challengers Bengaluru, 8th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 8వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగుల టార్గెట్ అందించింది.

CSK vs RCB: హాఫ్ సెంచరీతో ఒకరు.. 275 స్ట్రైక్ రేట్‌తో మరొకరు.. చెన్నైపై ఆర్‌సీబీ బ్యాటర్ల ఊచకోత
Chennai Super Kings Vs Royal Challengers Bengaluru, 8th Match
Follow us on

Chennai Super Kings vs Royal Challengers Bengaluru, 8th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 8వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగుల టార్గెట్ అందించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కెప్టెన్ పాటిదార్ 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31, పడిక్కల్ 27 మాత్రమే ఓ మోస్తారుగా బ్యాట్ ఝులిపించగా.. మిగతా వాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్కోరును 200 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లాడు.

చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2 వికెట్లు పడగొట్టగా, ఖలీల్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇరు జట్ల ప్లేయింగ్-11..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: సుయాష్ శర్మ, రసిక్ సలాం, మనోజ్ భండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్) , రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతిషా పతిరానా మరియు ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: శివం దుబే, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జిమ్మీ ఓవర్టన్, షేక్ రషీద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..