CSK vs PBKS, IPL 2022: ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన లివింగ్‌స్టోన్.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై..
CSK vs PBKS: డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా మూడో పరాజయాన్ని ఎదుర్కొంది. ఇప్పటికే కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు తాజాగా పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలోనూ చిత్తుగా ఓడింది.
CSK vs PBKS: డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా మూడో పరాజయాన్ని ఎదుర్కొంది. ఇప్పటికే కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు తాజాగా పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలోనూ చిత్తుగా ఓడింది. ముంబైలోని ఆదివారం రాత్రి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు చెన్నై జట్టుకు 180 పరుగుల టార్గెట్‌ను విధించింది. అయితే ప్రత్యర్థి బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది సీఎస్కే. 36 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. శివమ్ దూబె (57), ధోని (23) పరుగులు సాధించినా అవి పరాజయం వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడ్డాయి తప్ప జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. కేవలం 18 ఓవర్లలో 126 పరుగులకే సీఎస్కే చాప చుట్టేసింది. దీంతో 54 పరుగుల భారీ తేడాతో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. కాగా ఈ టోర్నీలో జడేజా జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమికాగా.. మయాంక్ సేనకు రెండో విజయం. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, చెన్నై తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
బౌలర్లు సత్తా చాటినా..
కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ముకేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి బౌండరీ కొట్టిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ (4) రెండో బంతికి ఉతప్ప చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఎం.ఎస్. ధోని చేసిన మెరుపు రనౌట్‌కు భానుక రాజపక్సే కూడా రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే వన్ డౌన్లో వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ (32 బంతుల్లో 60) బౌండరీలతో చెలరేగాడు. . మరో ఓపెనర్ శిఖర్ ధావన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆతర్వాత ధావన్ (33) ఔటైనా తన దూకుడును కొనసాగించాడు లివింగ్ స్టోన్. దీంతో 10 ఓవర్లకే వంద పరుగులను దాటింది పంజాబ్. అయితే ఆ తర్వాత చెన్నై బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో జట్టు స్కోరు వేగం మందగించింది. లివింగ్ స్టోన్ తో పాటు జితేశ్ శర్మ (26), షారుక్ (6), ఓడియన్ స్మిత్ (3) వెంటవెంటనే ఔటయ్యారు. ఇక చివరి ఓవర్లలో క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రిటోరియస్‌ల మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కేవలం181 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ ఆఖరి పది ఓవర్లలో కేవలం 71 పరుగులే చేసి ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం. అయితే పంజాబ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం చెన్నైకు ఎక్కువసేపు నిలవలేదు. ఛేదనలో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ తొలి రెండు ఓవర్లలోనే అవుట్ కాగా, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ కూడా త్వరగా పెవిలియన్ చేరుకున్నారు. అంబటి రాయుడు, కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా వారినే అనుసరించడంతో చెన్నై 8 ఓవర్లలో 38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
రాణించిన దూబె..
కాగా ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దూబె, ధోని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 7 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా వేగంగా ఆడిన దూబె 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్ చివరి రెండు బంతుల్లో దూబే, డ్వేన్ బ్రావోలను ఔట్ చేయడం ద్వారా లివింగ్ స్టోన్ చెన్నై ఆశలకు గండికొట్టాడు. ఆ తర్వాత ధోనీ కూడా ఎక్కువసేపు నిలవలేక పోవడంతో 18 ఓవర్లలో కేవలం 126 పరుగులకే చెన్నై ఆలౌటైంది. పంజాబ్ తరఫున రాహుల్ చాహర్ (3/25), లివింగ్‌స్టన్ (2/25) రాణించగా అరంగేట్రం ఆటగాడు వైభవ్ అరోరా (2/21) సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటడంతో పాటు ఒక సూపర్ క్యాచ్ పట్టిన లివింగ్ స్టోన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
2⃣ more points in the bag for @PunjabKingsIPL! ? ?
A fantastic performance from the @mayankcricket-led unit as they beat #CSK by 5⃣4⃣ runs to seal their second win of the #TATAIPL 2022. ? ? #CSKvPBKS
Scorecard ▶️ https://t.co/ZgMGLamhfU pic.twitter.com/TU4lEoVG7D
— IndianPremierLeague (@IPL) April 3, 2022
Also Read: Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ దందాపై కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..!
Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!