CSK vs KKR, Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని సూపర్ సండే రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. దీంతో 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలో తడబడినా విజయం సొంతం చేసుకోగలిగారు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ తరఫున నితీష్ రాణా(57, నాటౌట్), రింకూ సింగ్(54) అర్థశతకాలతో రాణించారు. చెన్నై తరఫున దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ గెలుపుతో కోల్‌కతా టీమ్ ఖాతాలో మరో విజయం చేరింది
అంతకముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ 17, డెవాన్ కాన్వే 30, రహానే 16, శివమ్ దుబే48 (నాటౌట్), జడేజా 20 పరుగులు చేశారు. ఇక చివర్లో వచ్చిన ధోని 3 బంతుల్లో రెండే పరుగులు చేసి అజేయంగా ఇన్నింగ్స్ ముగించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు, శార్ధుల్ ఠాకూర్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసుకున్నారు.
A solid bowling performance, followed by a Rinku-Rana special ?? pic.twitter.com/AsglYwYxiT
— KolkataKnightRiders (@KKRiders) May 14, 2023
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
చెన్నై వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించారు. కెప్టెన్ నితీష్ రాణా(57, నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. మరోవైపు కోల్‌కతా ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
మ్యాచ్ ముగిసే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్ రింకూ సింగ్(54) వెనుదిరిగాడు. మహీష్ తీక్షణ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని ఆడి రింకూ రన్‌ఔట్ అయ్యాడు. క్రీజులో రస్సెల్(2), నితీష్(53) ఉన్నారు. కోల్‌కతా విజయం దాదాపుగా ఖరారయినట్లే. ఎందుకంటే ఆ టీమ్‌కి ఇప్పుడు 10 బంతుల్లో 3 పరుగులు మాత్రమే అవసరం.
చెన్నైతో జరుగుతున్న నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయిన టీమ్‌కి కెప్టెన్ నితీష్ రాణా, రింకూ సింగ్ అండగా నిలిచారు. ఇద్దరు అర్థ సెంచరీలను పూర్తి చేసుకోవడంతో పాటు లక్ష్యానికి 13 పరుగుల దూరంలో ఉన్నారు. కోల్‌కతాకు ఇంకా 3 ఓవర్ల ఆట ఉంది.
చెన్నై టీమ్ ఇచ్చిన 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆట సగం పూర్తయింది. నితీష్ రాణా నేతృత్వంలోని నైట్ రైడర్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఇక క్రీజులో కెప్టెన్ నితీష్(14), రింకూ సింగ్(27) ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని సూపర్ సండే రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది.
17 ఓవర్లలో 5 వికెట్లకు115 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 ఓవర్లలో 5 వికెట్లకు 72 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లకు 68 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే, అంబటి రాయుడు ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే క్రీజులో ఉన్నాడు.
16 పరుగుల వద్ద అజింక్యా రహానే ఔటయ్యాడు. రితురాజ్ గైక్వాడ్ 17 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
7 ఓవర్లు ముగిసేసరికి CSK ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే, అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు. 17 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి చేతికి చిక్కి రితురాజ్ గైక్వాడ్ పెవిలియన్ చేరాడు.
చెన్నై ఓపెనర్లు డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. కానీ, కోల్‌కతా గెలిస్తే ఇతర జట్ల పనిని చెడగొట్టవచ్చు.