Video: 4,4,4,6,4,4.. 35 ఏళ్ల భారత బౌలర్‌ పరువు తీసిన 18 ఏళ్ల కుర్రాడు.. బ్లడ్ బాత్ వీడియో మీకోసం

Ayush Mhatre 6 Boundaries in Bhuvneshwar Kumar Over: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రే టీమిండియా, ఆర్‌సీబీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ ఓవర్లో బౌండరీలతో ఊచకోత కోశాడు. 17 ఏళ్ల ఆయుష్ ఈ అనుభవజ్ఞుడైన భారత బౌలర్ వేసిన ఒక ఓవర్లో 6 బౌండరీలు కొట్టి మొత్తం 26 పరుగులు రాబట్టాడు.

Video: 4,4,4,6,4,4.. 35 ఏళ్ల భారత బౌలర్‌ పరువు తీసిన 18 ఏళ్ల కుర్రాడు.. బ్లడ్ బాత్ వీడియో మీకోసం
Ayush Mhatre 6 Boundaries In Bhuvneshwar Kumar Over

Updated on: May 04, 2025 | 11:05 AM

Ayush Mhatre 6 Boundaries in Bhuvneshwar Kumar Over: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2025 (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్‌లో, 17 ఏళ్ల యువ ఓపెనర్ బ్యాట్ బీభత్సం కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనింగ్ చేసిన ఆయుష్ మాత్రే, ఈ మ్యాచ్‌లో తన తుఫాను బ్యాటింగ్‌తో చెన్నై అభిమానులను అలరించాడు. ఆర్‌సీబీ ఇచ్చిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, ఆయుష్ ప్రారంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లపై దాడి చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యువకుడు అనుభవజ్ఞుడైన ఐపీఎల్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ ఓవర్లో చెలరేగిపోయాడు. భువీ లైన్ అండ్ లెంగ్త్‌ను చెడగొట్టాడు. ఆయుష్ ఈ ఓవర్‌లోని 6 బంతులనూ బౌండరీలకు పంపించి, భువీ కంట రక్త కన్నీరు వచ్చేలా చేశాడు.

ఓవర్‌లోని ప్రతి బంతికి బౌండరీనే..

డేంజరస్ బ్యాటింగ్ చేస్తూ, ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్‌లో ఊచకోత కోశాడు. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ వేసిన ఆరు బంతులనూ మాత్రే బౌండరీలు బాదాడు. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా, మాత్రే ఫోర్లు, సిక్సర్లతో టపాసులు పేల్చాడు. ఆ ఓవర్‌లోని మొదటి మూడు బంతుల్లో మాత్రే ఫోర్లు కొట్టాడు. నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి సిక్స్‌గా పంపాడు. మాత్రే చివరి రెండు బంతులను కూడా ఫోర్లు బాదాడు. తద్వారా ఆ ఓవర్ మొత్తం స్కోరు 26 పరుగులుగా మారింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ చూసి భువనేశ్వర్ కుమార్ కూడా ఆశ్చర్యపోయాడు.

ఇవి కూడా చదవండి

25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. (వీడియో కోసం ట్వీట్‌ను క్లిక్ చేయండి)

చె
ఈ మ్యాచ్‌లో మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేసి IPL చరిత్రలో తన తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో అర్ధ సెంచరీ చేసిన మూడవ అతి పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. అతను 17 సంవత్సరాల 291 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత సీజన్‌లో 14 సంవత్సరాల 32 రోజుల వయసులో ఈ రికార్డును సాధించాడు.

సెంచరీ మిస్..

మాత్రే తన తొలి IPL సెంచరీ చేయడానికి కేవలం 6 పరుగుల దూరంలో ఆగిపోయాడు. 48 బంతుల్లో 94 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన సెంచరీని పూర్తి చేయడానికి లుంగీ న్గిడి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. కానీ బంతి కావలసిన లెంగ్త్‌కు బదులుగా చాలా ఎత్తుకు వెళ్లింది. కృనాల్ పాండ్య క్యాచ్ పూర్తి చేయడంలో ఎలాంటి తప్పు చేయలేదు. మాత్రే తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. మూడో వికెట్‌కు రవీంద్ర జడేజాతో కలిసి అతను సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..