Suresh Raina Father: సురేశ్‌ రైనా తండ్రి మృతి.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన త్రిలోక్‌చంద్‌..

|

Feb 06, 2022 | 3:47 PM

Suresh Raina Father: ఇండియన్‌ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్‌ రైనా ఆదివారం కన్నుమూశారు. గత కొద్దికాలంగా

Suresh Raina Father: సురేశ్‌ రైనా తండ్రి మృతి.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన త్రిలోక్‌చంద్‌..
Suresh Raina Father
Follow us on

Suresh Raina Father: ఇండియన్‌ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్‌ రైనా ఆదివారం కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఘజియాబాద్ లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అయితే తండ్రి మరణాన్ని రైనా వెల్లడించలేదు. ఆ విషయాన్ని దాచి మరీ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపాడు. త్రిలోక్‌చంద్‌ రైనా సైనికాధికారి. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన చాలా నైపుణ్యం గలవాడు. రైనా పూర్వీకులది జమ్ముకశ్మీర్‌లోని ‘రైనావరి’ గ్రామం. 1990ల్లో కశ్మీర్‌ పండితుల ఊచకోత తర్వాత త్రిలోక్‌చంద్‌ కశ్మీర్‌ నుంచి కుటుంబంతో సహా మురాదాబాద్‌ పట్టణానికి వచ్చాడు. అక్కడ రూ.10వేల జీతానికి పనిచేశాడు. సురేశ్ రైనా క్రికెట్‌ కోచింగ్‌కు సైతం డబ్బులు ఉండేవి కావు. తక్కువ జీతమే వస్తున్నా కొడుకు క్రికెటర్‌ను చేసేందుకు ఆయనెంతో కష్టపడ్డారు.

1998 లో రైనా లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేరాడు. అక్కడే క్రికెట్‌లో మెలకువలు నేర్చి క్రమంగా భారత జట్టులో స్టార్‌గా ఎదిగాడు. తండ్రి అంటే రైనాకు ఎంతో ఇష్టం. ఇండియాలో సిరీస్‌లు ఆడుతున్న మధ్య మధ్యలో తండ్రితో గడపడానికి ఘజియాబాద్ వెళ్లేవాడు. కశ్మీర్‌లో జరిగిన దారుణాల వల్ల తమ కుటుంబం కశ్మీర్‌ నుంచి వచ్చిందని ఎక్కడా చెప్పేవాడిని కాదని గతంలో రైనా పేర్కొన్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో క్రికెట్‌, క్రీడల అభివృద్ధికి సురేశ్ రైనా చేయూతనందిస్తున్నాడు. ఇదిలా ఉండగా రైనా తండ్రి మరణంపై పలువురు భారత క్రికెటర్లు స్పందించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

IND vs WI: లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపిన టీమ్‌ ఇండియా..1000వ వన్డేలో నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి..

Multiple Organ Failure: మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించిన లతామంగేష్కర్.. ఇది ఎలా జరుగుతుందో తెలుసా..?

Lata Mangeshkar: ఒకటో తరగతి కూడా చదవలేదు.. కానీ 6 విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌ అందించాయి..