పాక్ VS బంగ్లా మ్యాచ్: బంగ్లాదేశ్‌ టార్గెట్ 316 పరుగులు

|

Jul 05, 2019 | 7:52 PM

లార్డ్స్‌: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పోరాటం దాదాపుగా ముగిసిపోయినట్టే. బంగ్లాతో మ్యాచ్‌లో భారీ స్కోరుతో గెలుపొంది..రన్ రేట్ భారీగా సాధిస్తే తప్ప పాక్‌కు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు లేవని సంగతి తెలిసిందే.  టాస్ గెలిచి, ముందు బ్యాటింగ్ చేసినా కూడా పాకిస్థాన్ 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) సెంచరీ సాధించగా.. బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) మంచి షాట్స్‌తో జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా […]

పాక్ VS బంగ్లా మ్యాచ్: బంగ్లాదేశ్‌ టార్గెట్ 316 పరుగులు
Follow us on

లార్డ్స్‌: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పోరాటం దాదాపుగా ముగిసిపోయినట్టే. బంగ్లాతో మ్యాచ్‌లో భారీ స్కోరుతో గెలుపొంది..రన్ రేట్ భారీగా సాధిస్తే తప్ప పాక్‌కు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు లేవని సంగతి తెలిసిందే.  టాస్ గెలిచి, ముందు బ్యాటింగ్ చేసినా కూడా పాకిస్థాన్ 315 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) సెంచరీ సాధించగా.. బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) మంచి షాట్స్‌తో జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.  బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 5 వికెట్లు తీయగా,  సైపుద్దీన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనఫ్ కూడా బలీయంగా ఉంది. ఆరౌండర్లతో ఆ టీం కొన్ని మంచి విజయాలు నమోదు చేసింది.  ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిచినా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి.