IND Vs NZ: రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.? క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్

రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించడంతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత ఎలెవన్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ స్పందించాడు. అతను ఏం చెప్పడంటే?

IND Vs NZ: రెండవ టెస్టులో  శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.? క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్
Squad Change For New Zealand Test
Follow us

|

Updated on: Oct 23, 2024 | 12:59 PM

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ భారత్ వికెట్ కీపర్-బ్యాటర్‌ ఎవరో చెప్పేశాడు. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. పంత్ కుడి మోకాలిపై దెబ్బ కారణంగా రెండో టెస్టుకు  అందుబాటులో ఉండటంపై కొంత సందేహం ఉన్నందున ధుర్వ్ జురెల్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అతను రెండవ ఇన్నింగ్స్‌లో 99 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ స్పందించాడు. “అందరూ బాగానే ఉన్నారు. మొదటి టెస్టులో పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఫాస్ట్ బౌలర్లు అందరూ బాగున్నారు. రిషబ్ చాలా మంచివాడు. మొన్న అతను మోకాలి, కానీ వేళ్ల కదలికతో కొంచెం అసౌకర్యానికి గురయ్యాడు. అతను టెస్టులో (పుణెలో) నిలదొక్కుకోవడం మంచిది,” అని  డోచాట్ చెప్పాడు. శుభమాన్ గిల్ ఇంకా కొంచెం ఇబ్బందిపడుతున్నాడని మరోసారి టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించాడు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు.  కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..