Virat Kohli: కోహ్లీ విధ్వంసానికి రెండేళ్లు.. అక్టోబర్‌ 23 అంటే పాకిస్థాన్‌కు కాలరాత్రే

ఆస్ట్రేలియా గడ్డపై 2022 T20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 23 న మెల్‌బోర్న్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ని పాకిస్థాన్ వాళ్లు అంత ఈజీగా మార్చిపోలేరు.

Virat Kohli: కోహ్లీ విధ్వంసానికి రెండేళ్లు.. అక్టోబర్‌ 23 అంటే పాకిస్థాన్‌కు కాలరాత్రే
Virat Kohli's Shot Of The Century
Follow us

|

Updated on: Oct 23, 2024 | 11:50 AM

అక్టోబర్ 23 తేదీని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ని పాకిస్థాన్ వాళ్లు అంత ఈజీగా మార్చిపోలేరు. విరాట్ కోహ్లీ కూడా పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్ల అందరీకి గుర్తుకు ఉంటుంది. ఆస్ట్రేలియా గడ్డపై 2022 T20 ప్రపంచకప్‌లో టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 23 న మెల్‌బోర్న్‌లో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాల్లో ఒకటైన ఎంసీజీలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు హరీస్ రవూఫ్ స్పీడ్‌పై పాకిస్థాన్ ఫుల్ జోక్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే పైచేయి అని పలువురు క్రికెట్ పండితులు కూడా అభిప్రాయపడ్డారు. హరీస్ రవూఫ్ పేస్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను నాశనం చేయడానికి పాకిస్తాన్‌కు ముఖ్యమైన ఆయుధం అని అంచనా వేశారు. కానీ, ఏం జరిగిందంటే, ఊహాగానాలన్నీ తారుమారవ్వడమే కాకుండా, హరీస్ రవూఫ్ కూడా ముఖం దాచుకొవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టుకు ఆరంభం చెడిపోయింది. అతని ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఇద్దరూ 4-4 పరుగుల వద్ద ఔటయ్యారు. కేవలం 10 పరుగులకే రెండు భారీ వికెట్లు పడిపోవడంతో పరిస్థితి విషమంగా కనిపించడంతో పాక్ చెప్పినట్లే చేస్తుందనిపించింది. కానీ టీమిండియాకు విరాట్ కోహ్లీ దేవుడిలా ఆదుకున్నాడు. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. కోహ్లి కొట్టిన ఆ సిక్స్‌ర్‌లో ఒక్క సిక్స్‌ను ఐసీసీ షాట్ ఆఫ్ సెంచరీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీడియో ఇదిగో:

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.