Gayle Ready to Bat: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడడడంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌లో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఇప్పటికీ తనలో ఉందని గేల్ తేల్చి చెప్పాడు . అయితే గతేడాది ఐపీఎల్‌లో తాను మూడో స్థానంలో ఆడానని, ఇప్పుడు తాను నెంబర్ 3 స్పెషలిస్ట్‌గా మారానని గేల్ అన్నాడు.
ఇప్పటివరకు విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిగినట్లుగా చెప్పు కొచ్చాడు. అయితే ఈ సిరీస్ తరువాత టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా స్థానం సంపాదించాలని ఆశిస్తున్నానని గేల్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తాను ప్రపచం బ్యాట్స్‌మెన్‌లలో బెస్ట్‌గానే ఉన్నానని, ఓపెనర్, మూడో స్థానం, ఐదో స్థానం ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలనని అన్నాడు.
తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం పై కూడా ఆలోచన చేశానని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని అన్నాడు. అయితే ప్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని అన్నాడు. ఇదిలా ఉంటే 2019 ప్రపంచ కప్ తరువాత గేల్ జాతీయ జట్టుకు మళ్లీ ఆడలేదు. ఒకవేళ ఈ సిరీస్‌కు ఎంపికైతే విండీస్ జెర్సీలో గేల్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.
గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!
Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!