
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చిదంబరం స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్ ముందు, భారత జట్టుకు గాయం ఆందోళన ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ నెట్ సెషన్‌లో క్యాచింగ్ డ్రిల్ సమయంలో తన చీలమండ భాగంలో గాయపడ్డాడు. గాయం కారణంగా అభిషేక్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లాడు. ఫిజియోతో దాదాపు అరగంట గడిపిన తరువాత, అతను కొద్దిగా కుంటుతూ కనిపించాడు, ఇది అభిమానుల్లో ఆందోళన కలిగించింది.
కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులు చేసి, ఎనిమిది సిక్సర్లు కొడుతూ భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. భారత బౌలర్‌లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. అర్ష్‌దీప్ ఆరంభంలో రెండు వికెట్లు తీయగా, చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను 132 పరుగులకే కట్టడి చేశారు. అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చారు.
రెండో టీ20లో అభిషేక్ అందుబాటులో లేకపోతే, వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే, తిలక్ వర్మ లేదా సంజూ శాంసన్‌ను ఓపెనింగ్‌కు పంపే యోచన కూడా ఉంది.
మొదటి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి తన గూగ్లీలతో ఇంగ్లాండ్ బ్యాటర్‌లను తీవ్ర ఇబ్బందుల్లో పడేసాడు. మ్యాచ్ అనంతరం, వరుణ్ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడడం క్రికెటర్లకు ఎంతో ఉపయోగకరమని, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థాయి ఐపీఎల్‌కు సమానంగా ఉందని అభిప్రాయపడ్డాడు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. తమ ఆటను మెరుగుపరచుకోవడానికి భారత క్రికెటర్లు వీటిలో ఎక్కువగా పాల్గొనాలని వారు చెప్పారు.
భారత జట్టు రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను 2-0తో ముందంజలో ఉంచాలనుకుంటోంది. అభిషేక్ గాయం బాగా తగ్గి తిరిగి జట్టులో చేరితే, భారత బ్యాటింగ్ శక్తి మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. ఇంగ్లాండ్ కూడా తమ వైఫల్యాలను పునరాలోచించి పోటీగా నిలవాలని చూస్తోంది.
సూర్యకుమార్ యాదవ్(సి), సంజూ శాంసన్(wk), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా , రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(vc), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్(wk)
జట్టు: జోస్ బట్లర్(సి), హ్యారీ బ్రూక్(vc), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్(wk), జామీ స్మిత్(wk), జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్‌సన్, సకీబ్ ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..