Chennai Super Kings vs Punjab Kings Live Updates: ఎంతో కీలకంగా మారిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని సాధించింది. చెన్నై నిర్ధేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా చేధించింది. కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. ప్లే ఆఫ్‌లో స్థానం దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత ఆటతీరుతో జట్టుకు విజయాన్ని సొంతం చేశాడు. మొదటి నుంచి భారీ షాట్‌లతో రాణిస్తూ టీమ్ స్కోరును పరుగులు పెట్టించాడు. భారీ సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ అందుకు తగ్గుట్లుగానే సక్సెస్ అయ్యిందని చెప్పాలి. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశారు. ఈ క్రమంలో పంజాబ్ బౌలర్ట దాటికి చెన్నై బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయిన చెన్నై 134 పరుగులు చేసింది. అయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఇలా తడబడడం గమనార్హం. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో డు ప్లెసిస్ ఒక్కడే ఎక్కవ పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 55 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, మొయిన్ అలీ, జోష్ హాజెల్‌వుడ్.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్, షారూఖ్ ఖాన్, మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్, సర్ఫరాజ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, మొయిసెస్ హెన్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రవి బిష్ణోయ్.
చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా చేధించింది. కేవలం 13 ఓవర్‌లలోనే 4 వికెట్లను కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసరక ఆటతీరుతో పంజాబ్‌కు గెలుపును ఖరారు చేశాడు. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలుపు కచ్చితంగా మారిన సందర్భంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. జట్టు గెలుపు బాధ్యతను తీసుకున్న రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
చెన్నై లక్ష్యాన్ని పంజాబ్ అవలీలగా చేధించేలా కనిపిస్తోంది. రాహుల్ అద్భుత ఆటతీరుతో పంజాబ్ స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్ విజయానికి 44 బంతుల్లో కేవలం 6 పరుగులు చేయాల్సి ఉంది.
చెన్నై ఇచ్చిన లక్ష్యాన్ని చేరువయ్యే క్రమంలో రాహుల్ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నాడు. ఈ క్రమంలో 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.
మొదట్లో దూకుడుగా ఆడినా పంజాబ్ బ్యాట్స్‌మెన్ రెండు వికెట్లు పడేసరికి కాస్త తడబడుతున్నారు. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 50 పరుగుల వద్ద కొనసాగుతోంది.
పంజాబ్ తొలి వెకెట్‌ను కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్‌లు బాగా రాణిస్తున్నారనుకుంటున్న సమయంలో మయాంక్ అగర్వాల్‌ను థాకూర్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. ఇక చివరి బంతికి డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడు.
కేఎల్ రాహుల్ మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడో ఓవర్‌లో వరుసగా 2, 3వ బంతిని బౌండరీగా మార్చాడు. అనంతరం 5వ బంతికి సిక్స్ కొట్టాడు. దీంతో రాహుల్ కేవలం 15 బంతుల్లో 33 పరుగులు సాధించాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. రెండో ఓవర్‌లో మొదటి బంతిని రాహుల్ సిక్స్‌గా మలిస్తే. 5వ బంతిని ఫోర్‌గా మార్చాడు మయాంక్ అగర్వాల్. మూడు ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ స్కోర్ 28 పరుగుల వద్ద కొనసాగుతోంది.
కేఎల్ రాహుల్ సూపర్ సిక్స్ కొట్టాడు. చహార్ మూడో ఓవర్‌లో వేసిన మొదటి బంతిని బౌండరీని దాటించాడు. ఇలా ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు రాహుల్.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించిందని చెప్పాలి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ ఓపెనర్స్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 13 పరుగులు సాధించింది. అయితే రెండో ఓవర్‌లో మాత్రం కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం రాహుల్ (10), మయానక్ అగర్వాల్ (02 ) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తక్కువ స్కోరుకునే పరిమితమవుతుందని అనుకుంటున్న సమయంలో డు ప్లెసిస్ బాగా రాణించడంతో చెన్నై ఒక గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. నిర్ణీత 20 ఓవర్‌లలో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. పంజాబ్ గెలుపునకు 135 పరుగులు చేయాల్సి ఉంది.
చివరి ఓవర్‌లో భారీగా పరుగులు సాధించాలని ప్రయత్నించిన డు ప్లెసిస్ తొలి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టాడు. అయితే మూడో బంతిలోనూ అలాగే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 129 వద్ద కొనసాగుతోంది.
చెన్నై స్కోరుకు పెంచే క్రమంలో చాన్స్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 18.5 బంతిని భారీ షాట్‌తో బౌండరీ బయట వేశాడు. డు ప్లెసిస్ కొట్టి ఈ సిక్స్ ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌గా చెప్పవచ్చు. చెన్నై 19 ఓవర్లకు గాను 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
తక్కువ స్కోరుకే వరుస వికెట్లు కోల్పోతున్న తరుణంలో చెన్నై జట్టును ఆదుకునే పనిలో పడ్డాడు డు ప్లెసిస్. ఈ క్రమంలోనే బాధ్యతాయుతంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసి జట్టు స్కోరును పెంచుతున్నాడు. ప్రస్తుతం డుప్లెసిస్ 50 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర కష్టాల్లోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. వరుస వికెట్లు కోల్పోయిన చెన్నైని ధోనీ ఆదుకుంటాడని అందరూ భావించారు. అయితే అందుకు తగ్గట్లుగానే మొదట ఆచితూచి ఆడిన ధోనీ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ వేసిన బంతికి షాట్‌కు ప్రయత్నించిన ధోనీ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం చెన్నై 13 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు సాధించింది.
50 పరుగులలోపే 4 వికెట్లు కోల్పోయిన క్రమంలోనే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఇందులో భాగంగానే రవి బిషోనీ వేసిన 9.1 బంతికి బౌండరీ బాదాడు. మరి ధోనీ ఇదే జోరుకు కొనసాగిస్తాడా.. చూడాలి. చెన్నై 10.2 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 53 పరుగులు సాధించింది.
పంజాబ్ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ కష్టాల్లోకి వెళుతోంది. ఈ క్రమంలోనే రాయుడు రూపంలో మరో వికెట్ కోల్పోయింది. జోర్డన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అంబటి రాయుడు అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో చెన్నై 50 పరుగలలోపే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం చెన్నై 8.3 ఓవర్లకు 42 పరుగులు చేసింది.
తక్కువ పరుగులకే వికెట్లు పడడంతో చెన్నై బ్యా్ట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ డు ప్లెసిస్, అంబటి రాయుడు పాట్నర్‌షిప్‌ను పెంచే పనిలో ఉన్నారు. 8 ఓవర్ల సమాయానికి చెన్నై 39 పరుగులతో ఉంది.
పంజాబ్ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా రాబిన్ ఉతప్ప కూడా అవుట్ అయ్యాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన ఉతప్ప జోర్డాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హర్‌ప్రీత్ బ్రార్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 3 వికెట్ల నష్టానికి 33 పరగుల వద్ద కొనసాగుతోంది.
పంజాబ్ బౌలర్లు రాణిస్తుండడంతో చెన్నై బ్యాట్స్‌మెన్ కాస్త తడబడుతున్నారు. దీంతో మొయిన్ అలీ కూడా అవుట్ అయ్యాడు. అర్షదీప్ సింగ్ వేసి బంతికి 5.4 మొయిన్ అలీ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. చెన్నై కోల్పోయిన రెండు వికెట్లు కూడా అర్షదీప్ తీసుకోవడం విశేషం. ఇక 6 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.
పంజాబ్ బౌలర్స్ చెన్నైని కట్డడి చేయడంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నారు. 5 ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 5 ఓవర్‌లు ముగిసే సమయానికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ప్రస్తుతం డు ప్లెసిస్ (6), మొయిన్ అలీ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. అర్షదీప్ సింగ్ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ గ్వైకాడ్, షారూఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో చెన్నై తన తొలి విక్‌ట్‌ను కోల్పోయింది. రుతురాజ్ 14 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
మొదటి ఓవర్‌లో మహమ్మద్ షమీ అద్భతంగా బౌల్ చేయడంతో చెన్నై కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించింది. అయితే రెండో ఓవర్‌లో తొలి బంతికే హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతికి రితురాజ్ గైక్వాడ్ భారీ షాట్‌తో జట్టుకు తొలి బౌండరీని అందించాడు. రెండో ఓవర్ ముగిసే సమయానికి చెన్నై ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 11 పరుగుల వద్ద కొనసాగుతోంది.
పంజాబ్, చెన్నైల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన పోరు కనిపిస్తోంది. అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ పోరులో మొదటి రెండు స్థానాల్లో మొదటి ప్లేస్‌లో ఉన్న రాహుల్ పంజాబ్ నుంచి, రెండో స్థానంలో ఉన్న రితురాజ్ గైక్వాడ్ చెన్నై తరఫున ఉన్నారు. మరి వీరిద్దరి స్థానాలు ఏమైనా మారుతాయో చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్, రవీంద్ర జడేజా, రితురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, మొయిన్ అలీ, జోష్ హాజెల్‌వుడ్.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్, షారూఖ్ ఖాన్, మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్, సర్ఫరాజ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, మొయిసెస్ హెన్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రవి బిష్ణోయ్.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. టాస్ గెలుచుకున్న పంజాబ్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో దుబాయ్ పిచ్‌లన్నీ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో పంజాబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పంజాబ్ తీసుకున్న నిర్ణయం ఏమేర ఫలిస్తుందో చూడాలి.