MS Dhoni: చివరి సీజన్‌పై ధోనీ భారీ స్కెచ్.. ఐపీఎల్ 16 ట్రోఫీ మాదే అంటోన్న సీఎస్‌కే ఫ్యాన్స్..

|

Jan 06, 2023 | 3:33 PM

Chennai Super Kings: 3 ఏళ్ల తర్వాత ఐపీఎల్ జట్లు తమ సొంత మైదానాల్లో ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో సీఎస్‌కే తన ఆటగాళ్లకు చెపాక్ స్టేడియంలో స్పెషల్ ప్లాన్స్ సిద్ధం చేయనుంది.

MS Dhoni: చివరి సీజన్‌పై ధోనీ భారీ స్కెచ్.. ఐపీఎల్ 16 ట్రోఫీ మాదే అంటోన్న సీఎస్‌కే ఫ్యాన్స్..
Dhoni
Follow us on

IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇప్పటి నుంచి ఐపీఎల్ 2023 కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ సొంత మైదానం చెపాక్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్‌లో అడుగుపెట్టనుంది. గత మూడు సీజన్‌లుగా కరోనా మహమ్మారి కారణంగా, ఫ్రాంచైజీలు వారి సొంత మైదానంలో ఆడే అవకాశం లభించలేదు. అయితే, కోరనా భయం దాదాపుగా ముగిసింది. దీంతో ఐపీఎల్ మరోసారి దాని పాత ఫార్మాట్‌కి తిరిగి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తమ ఆటగాళ్లకు వారి సొంత గ్రౌండ్ అనుభవాన్ని అందించాలని కోరుకుంటుంది.

సీఎస్‌కే యాజమాన్యంలోకి సిబ్బంది వివరాల మేరకు.. తేదీ ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ శిబిరం ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో రెండు వారాల నుంచి ఒక నెల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నైలోని పరిస్థితులకు అనుగుణంగా సీఎస్‌కే ఆటగాళ్లు మారాలని ధోనీ, ఫ్లెమింగ్‌లు కోరుతున్నారంట. అందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తున్నారు.

స్కిల్స్, టెక్నిక్‌ని మెరుగుపరిచేందుకు స్పెషల్ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం పిచ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు విభిన్న సవాళ్లను అందిస్తుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కే తన సగం మ్యాచ్‌లను ఈ మైదానంలో ఆడవలసి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో జరిగే ఈ శిబిరం సీఎస్‌కే ఆటగాళ్లకు చెపాక్ పిచ్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడడమే కాకుండా, యువ ఆటగాళ్లలో నైపుణ్యాలు, మెళుకువలను మెరుగుపరిచేందుకు కూడా కృషి చేస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..