CSK: ధోని వచ్చేస్తున్నాడు.. మూడేళ్ల తర్వాత ‘చెపాక్’లో చెన్నై మ్యాచ్.. ఇక చూస్కో నా సామీరంగా..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రానే వచ్చింది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌లది రిలీజైనప్పటికీ..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రానే వచ్చింది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌లది రిలీజైనప్పటికీ.. మార్చి 31 నుంచి మే 21 వరకు సమరం శంఖం పూరించనున్నాయి ఫ్రాంచైజీలు. ఈసారి మ్యాచ్‌లు ఫ్రాంచైజీల సొంత గ్రౌండ్స్‌లో కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ధోని అభిమానులు, సీఎస్‌కే ఫ్యాన్స్.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సరిగ్గా మూడేళ్ల తర్వాత.. గణాంకాలతో సహా లెక్కపెడుతూ 1427 రోజుల అనంతరం చెపాక్‌లో ధోని అడుగుపెట్టనున్నాడని.. ఫ్యాన్స్ ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. సీఎస్‌కే తమ హోం గ్రౌండ్స్‌లో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఏప్రిల్ 3, 12, 21, 30, మే 5, 10, 14 జరగనున్నాయి.
-
షెడ్యూల్:
మార్చి 31 – vs గుజరాత్ టైటాన్స్(A), ఏప్రిల్ 3 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 8 – vs ముంబై ఇండియన్స్(A), ఏప్రిల్ 12 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 17 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(A), ఏప్రిల్ 21 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(H), ఏప్రిల్ 23 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 27 – vs రాజస్థాన్ రాయల్స్(A), ఏప్రిల్ 30 – vs పంజాబ్ కింగ్స్(H), మే 4 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), మే 5 – vs ముంబై ఇండియన్స్(H), మే 10 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), మే 14 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 20 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A)
-
స్క్వాడ్:
మహేంద్ర సింగ్ ధోని, కాన్వె, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సేనాపతి, మొయిన్ అలీ, శివం దూబే, హంగర్గేకర్, ప్రిటోరియస్, శాంట్నార్, జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరీ, పాతిరానా, సిమర్జీట్ సింగ్, దీపక్ చాహార్, సోలంకి, తీక్షనా, అజింక్యా రహనే, షేక్ రషీద్, బెన్ స్టోక్స్, నిశాంత్ సింధు, కైలీ జామిసన్, భగత్ వర్మ, అజయ్ మండల్
*H – హోం మ్యాచ్‌లు – A – ఎవే మ్యాచ్‌లు..
3rd April 2023 : The Return of Thala MS Dhoni at Chepauk after 3 years ??#WhistlePodu #MSDhoni @MSDhoni pic.twitter.com/BCSULnwrT6
— DHONIsm™ ❤️ (@DHONIism) February 17, 2023
After 3 years, 5 months, 27 days, 2 hours and around 15 minutes, @MSDhoni is coming back to chepauk ??️#WhistlePodu #MSDhoni #IPL2023 pic.twitter.com/2uL9ZJwsCr
— DHONIsm™ ❤️ (@DHONIism) February 17, 2023