Cricket: 19 బంతుల్లో 96 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్‌.. బౌలర్లను రఫ్ఫాడించిన బ్యాటర్లు ఎవరంటే!

|

Jun 03, 2022 | 6:54 PM

England Domestic Cricket: ధోని శిష్యుడా.. మజాకానా.. మైదానంలో ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్ చూపించాడు.. దెబ్బకు ప్రత్యర్ధి జట్టు బెంబేలెత్తిపోయింది. అతడెవరో తెలుసా.!

Cricket: 19 బంతుల్లో 96 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్‌.. బౌలర్లను రఫ్ఫాడించిన బ్యాటర్లు ఎవరంటే!
Sam Curran
Follow us on

20 ఓవర్ల మ్యాచ్.. అంటే టీ20 కాబట్టి.. బహుశా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. 170 లేదా 180 కొడతారని మీరు ఊహించవచ్చు. అయితే మీరు పొరపాటు పడినట్లే. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ ఏదైనప్పటికీ.. జట్టులో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నట్లయితే.. ఆ టీం స్కోర్ 200 దాటడం పక్కా అవుతోంది. సరిగ్గా అదే సీన్ ఇక్కడ కూడా జరిగింది. ఇటీవల ఇంగ్లాండ్‌లోని టీ20 బ్లాస్ట్ 2022 టోర్నమెంట్‌లో ఓ మ్యాచ్ ‌వార్ వన్‌సైడెడ్‌గా జరిగింది.

ఓవల్ మైదానం వేదికగా సర్రే, హంప్‌షైర్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హాంప్‌షైర్, సర్రేను బ్యాటింగ్‌కు దింపింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్(1) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ జాక్స్(64), సామ్ కర్రన్(69) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరూ కలిసి 74 బంతులు ఎదుర్కుని 133 పరుగులు చేశారు. బౌండరీల రూపంలో వీళ్లు ఏకంగా 19 బంతుల్లో 96 పరుగులు చేశారు. అలాగే చివర్లో నరైన్ 23 బంతుల్లో 52 పరుగులు చేయడంతో సర్రే జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

ఇక భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ‌హం‌ప్‌షైర్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గబ్బిన్స్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ మెక్‌దేర్మొట్(29), టామ్ ప్రేస్ట్(23) కాసేపు స్కోర్ బోర్డు కదిలించినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సామ్ కర్రన్ చక్కటైన బంతులతో ఇరువురిని పెవిలియన్ చేర్చాడు. మిడిల్ ఆర్డర్‌లో జేమ్స్ ఫుల్లర్(43) మెరుపులు మెరిపించినప్పటికీ.. సామ్ కర్రన్ 5 వికెట్లు తీయడంతో హంప్‌షైర్ జట్టు 156 పరుగులకే ఆలౌట్ అయింది.

సామ్ కర్రన్ విధ్వంసం…

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కర్రన్.. అటు బ్యాట్.. ఇటు బంతితో వీరబాదుడు బాదాడు. తొలుత బ్యాట్‌తో 38 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. అటు బంతితో 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.