ODI World Cup 2023: ఈ 15 మంది ప్లేయర్లపైనే 140 కోట్ల మంది భారతీయుల ఆశలు.. వన్డే రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?

Team India ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఇందులో ఏడుగురు బ్యాట్స్‌మెన్ 88 సెంచరీల సాయంతో 29,256 పరుగులు చేశారు. వన్డేల్లో ఇప్పటి వరకు నలుగురు భారత బౌలర్లు మొత్తం 450 వికెట్లు పడగొట్టారు. నలుగురు ఆల్‌రౌండర్లు మొత్తం 388 వికెట్లు పడగొట్టి 5,858 పరుగులు చేశారు. ఆటగాళ్లందరి వన్డే రికార్డులను తెలుసుకుందాం..

ODI World Cup 2023: ఈ 15 మంది ప్లేయర్లపైనే 140 కోట్ల మంది భారతీయుల ఆశలు.. వన్డే రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?
Team India World Cup 2023 S

Updated on: Sep 06, 2023 | 4:44 PM

Team India ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే ప్రపంచ కప్ 2023 మొదలు కానుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ 88 సెంచరీల సాయంతో 29,256 పరుగులు చేశారు. వన్డేల్లో ఇప్పటి వరకు నలుగురు భారత బౌలర్లు మొత్తం 450 వికెట్లు పడగొట్టారు. నలుగురు ఆల్‌రౌండర్లు మొత్తం 388 వికెట్లు పడగొట్టి 5,858 పరుగులు చేశారు. వన్డే ప్రపంచ కప్ బరిలో నిలిచిన ఆటగాళ్లందరి ODI ఫార్మాట్ రికార్డులను ఓసారి తెలుసుకుందాం..

  1. రోహిత్ శర్మ 246 వన్డేల్లో 9,922 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ మొత్తం 30 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 264 పరుగులు.
  2. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ 29 వన్డేల్లో 1514 పరుగులు చేశాడు. అతను 7 అర్ధసెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. గిల్ అత్యుత్తమ స్కోరు 208 పరుగులు.
  3. విరాట్ కోహ్లీ 277 వన్డేలు ఆడి 12,902 పరుగులు చేశాడు. కోహ్లీ 46 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు చేశాడు. కింగ్ కోహ్లీ అత్యుత్తమ స్కోరు 183 పరుగులుగా నిలిచింది.
  4. ఇషాన్ కిషన్ 19 వన్డేల్లో 776 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 210 పరుగులు. అతను 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలు చేశాడు.
  5. అన్ ఫిట్ అయిన కేఎల్ రాహుల్ 54 వన్డేల్లో మొత్తం 1986 పరుగులు చేశాడు. అతను 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు చేశాడు.
  6. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 26 వన్డేల్లో మొత్తం 511 పరుగులు చేశాడు. అతను 2 అర్ధ సెంచరీలు చేశాడు. మెరుగైన ప్రదర్శనపై ఆశలు పెట్టుకున్నాడు.
  7. అన్‌ఫిట్‌తో ఫిట్‌గా మారిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు 44 వన్డేల్లో 1645 పరుగులు చేశాడు. అతను 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు చేశాడు.
  8. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 86 వన్డేల్లో 141 వికెట్లు తీశాడు. ఈ చైనామన్ బౌలర్ వన్డే వరల్డ్ కప్‌లో సత్తా చాటేందుకు బరిలోకి దిగనున్నాడు.
  9. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 79 వన్డేల్లో 11 అర్ధ సెంచరీల సాయంతో 1753 పరుగులు చేశాడు. మొత్తం 74 వికెట్లు తీశాడు.
  10. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 179 వన్డేల్లో 2,574 పరుగులతో 197 వికెట్లు పడగొట్టాడు.
  11. టీమిండియా అక్షర్ పటేల్ 52 వన్డేల్లో 413 పరుగులు చేశాడు. 58 వికెట్లు పడగొట్టాడు.
  12. శార్దూల్ ఠాకూర్ 40 వన్డేల్లో 318 పరుగులు చేశాడు. భారత్ తరపున వన్డేల్లో 59 వికెట్లు తీశాడు.
  13. మహ్మద్ సిరాజ్ 26 వన్డేల్లో మొత్తం 46 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో అతనొకడు.
  14. జస్ప్రీత్ బుమ్రా 73 వన్డేల్లో 121 వికెట్లు తీశాడు. అతను ప్రాణాంతక యార్కర్లు, స్వింగ్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించడం కనిపిస్తుంది.
  15. భారత జట్టులోకి పునరాగమనం చేసిన మహ్మద్ షమీ 91 వన్డేల్లో 163 ​​వికెట్లు పడగొట్టాడు. భారతదేశం తరపున 3 ప్రపంచ కప్‌లు ఆడిన షమీ.. ఇది చివరి ప్రపంచ కప్ కావొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..