
RCB vs PBKS Predicted Playing 11: ఐపీఎల్ 2025లో ఈ రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఓ కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఆర్సీబీ బయట మ్యాచ్‌లను నిలకడగా గెలిచింది. కానీ, సొంత మైదానంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. పంజాబ్‌తో అది కూడా సొంత మైదానంలో హ్యాట్రిక్ పరాజయాల నుంచి తప్పుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు జట్లలో ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఓపెనింగ్ జోడీ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ జట్టుకు నిలకడగా గొప్ప ఆరంభాన్ని అందిస్తున్నారు. గత మ్యాచ్‌లో వీరు అద్భుతంగా ఆడారు. జట్టులో ఎటువంటి మార్పు జరుగుతుందనే ఆశ లేదు. ఈ సీజన్‌లో కోహ్లీ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. జట్టు కోహ్లీ నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. లియామ్ లివింగ్‌స్టోన్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. కానీ, అతను బంతితో మంచి సహకారం అందించగలడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్: యువ ప్రియాంష్ ఆర్య, ప్రబ్ సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ జోడీ నుంచి పంజాబ్ మరోసారి దూకుడు ఆరంభం ఆశిస్తోంది. ఈ ఇద్దరు బ్యాటర్లకు చిన్నస్వామి మైదానం అనుకూలంగా ఉండవచ్చు. గ్లెన్ మాక్స్‌వెల్ నిరంతరం విఫలమవుతున్నాడు. చిన్నస్వామిలో స్పిన్నర్లకు పెద్దగా సహాయం లభించకపోవడంతో, అతని స్థానంలో మార్కస్ స్టోయినిస్‌కు అవకాశం ఇవ్వవచ్చు. జేవియర్ బార్ట్‌లెట్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి, అతని స్థానం కూడా సేఫ్. అయితే, అందరి దృష్టి యుజ్వేంద్ర చాహల్ పైనే ఉంటుంది. అతను తన పాత ఫ్రాంచైజీ బెంగళూరుకు వ్యతిరేకంగా ఆడుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, సుయాన్ష్ షెడ్జ్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..