
IPL 2026 Winner Prediction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల ముగిసింది. రాబోయే సీజన్ కోసం అన్ని జట్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్లను బలోపేతం చేసుకున్నాయి. అయితే వేలం తర్వాత జట్ల బలాబలాలను పరిశీలిస్తే, ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరేందుకు అత్యంత అర్హమైనవిగా కనిపిస్తున్నాయి. వాటిలో ఒక జట్టు ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ జట్ల వివరాలు ఇవే:
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఐపీఎల్ 2026 వేలంలో ఆర్‌సీబీ తెలివైన నిర్ణయాలు తీసుకుంది. 2025లో టైటిల్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఈ జట్టు, ఈసారి కూడా బలంగా కనిపిస్తోంది.
కీలక కొనుగోలు: వెంకటేష్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకోవడం వీరి ప్రధాన బలం. అలాగే న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్ వంటి వారిని కూడా జట్టులో చేర్చుకున్నారు.
అంచనా: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టు, మరోసారి టైటిల్ గెలిచే సత్తా ఉన్న జట్టుగా కనిపిస్తోంది.
2. చెన్నై సూపర్ కింగ్స్ (CSK): చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసింది.
కీలక కొనుగోలు: ఎవరికీ పెద్దగా తెలియని ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అనే ఇద్దరు ఆటగాళ్ల కోసం చెన్నై ఏకంగా రూ. 14.20 కోట్లు చొప్పున వెచ్చించింది. వీరితో పాటు మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ వంటి వారిని తీసుకుంది.
అంచనా: ప్లేఆఫ్స్ ఆడటంలో అపారమైన అనుభవం ఉన్న సీఎస్‌కే, కొత్త కూర్పుతో మరోసారి టాప్-4లో నిలిచే అవకాశం ఉంది.
3. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): గత సీజన్లలో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు, ఈసారి బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేసుకుంది.
కీలక కొనుగోలు: ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ. 13 కోట్లకు కొనుగోలు చేయడం వీరి అతిపెద్ద అస్త్రం. ఇప్పటికే జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి టీ20 స్పెషలిస్టులు ఉన్నారు.
అంచనా: శివమ్ మావి వంటి బౌలర్ల రాకతో బౌలింగ్ కూడా పటిష్టమైంది. జట్టు కూర్పు చూస్తుంటే ప్లేఆఫ్స్ రేసులో వీరు గట్టి పోటీదారులుగా ఉన్నారు.
4. ముంబై ఇండియన్స్ (MI): వేలానికి ముందు ముంబై వద్ద తక్కువ బడ్జెట్ (పర్సు) ఉన్నప్పటికీ, ఉన్నంతలో మంచి జట్టును సిద్ధం చేసింది.
కీలక కొనుగోలు: తక్కువ ధరకే క్వింటన్ డి కాక్‌ను తిరిగి దక్కించుకోవడం ముంబైకి కలిొసొచ్చే అంశం.
అంచనా: ముంబై వద్ద ఇప్పటికే బలమైన కోర్ టీమ్ ఉంది. దానికి డి కాక్ అనుభవం తోడవ్వడంతో, రికార్డు స్థాయి విజయాలు ఉన్న ముంబై మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, వేలం తర్వాత అన్ని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వెంకటేష్ అయ్యర్ రాకతో వారి బ్యాటింగ్ మరింత బలపడింది. విశ్లేషణల ప్రకారం, ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..