Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఆసీస్‌కు ఎదురు దెబ్బ.. ఇలాగైతే కష్టమే!

|

Feb 12, 2025 | 7:43 PM

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ మినీ వరల్డ్ కప్ కోసం ప్రధాన జట్లు వన్డే సిరీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఆసీస్‌కు ఎదురు దెబ్బ.. ఇలాగైతే కష్టమే!
Australia Cricket Team
Follow us on

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును కష్టాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అందువల్ల, కెప్టెన్సీని స్టీవ్ స్మిత్ కు అప్పగించారు. . ఇప్పుడు మిచెల్ స్టార్క్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు బాగా బలహీనపడింది. కాఆ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శ్రీలంకను 2-0 తేడాతో ఓడించింది. వన్డే సిరీస్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే ఉంటుందని భావించారు. అయితే, తొలి మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 214 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది.

ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ జట్టు బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పర్చారు. టాప్ నలుగురు బ్యాటర్లు కేవలం 31 పరుగులకే ఔటయ్యారు. కానీ కెప్టెన్ అసలంకా ఎదురుదాడి చేసి 126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక జట్టు 46 ఓవర్లలో 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు త్వరగా అవుట్ అయ్యారు. మాథ్యూ షార్ట్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. జాక్ ఫ్రేజర్ మెక్‌గుయిర్క్ 2 పరుగులకే నిష్ర్కమిచాడు. కూపర్ కొన్నోలీ 3 పరుగులకు, స్టీవ్ స్మిత్ 12 పరుగులకు, మార్నస్ లబుషేన్ 15 పరుగులకు ఔటయ్యారు. అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ కాసేపు పోరాడినా ఆస్ట్రేలియాకు పరాజయం తప్పలేదు. చివరికీ ఆస్ట్రేలియా జట్టు 165 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 49 పరుగుల తేడాతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

 

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, కూపర్ కొన్నోలీ, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), ఆరోన్ హార్డీ, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిండు మెండిస్, చరిత్ అస్లాంక (కెప్టెన్), జెనిత్ లియానాగే, దునిత్ వెల్లేజ్, వనిండు హసరంగా, మహేష్ థెక్షణ, ఎషాన్ మలింగ, అసిత ఫెర్నాండో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..