Champions Trophy: టీమిండియాతో సెమీస్‌కి ముందు ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భారత్‌తో ఆడే ముందు ఆస్ట్రేలియాకు షాక్‌. స్టార్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో కూపర్ కొన్నోలీని తీసుకున్నారు. కొన్నోలీ ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వస్తాడా లేదా జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా ఇంగ్లిస్ ఓపెనింగ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. షార్ట్ గాయం భారత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

Champions Trophy: టీమిండియాతో సెమీస్‌కి ముందు ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ!
Ind Vs Aus

Updated on: Mar 03, 2025 | 1:42 PM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన భారత్‌తో జరిగే మ్యాచ్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతున్న తరుణంలో షార్ట్‌ గాయం వాళ్లకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షార్ట్ గాయపడ్డాడు. గాయంతో బాధపడుతున్న షార్ట్‌ మెరుగైన చికిత్స కోసం ఆస్ట్రేలియాకు వెళ్తున్నాడు. ఇక అతని స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీని జట్టులోకి తీసుకుంది. కూపర్‌ మార్చి 4న టీమిండియాతో జరిగే సెమీ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.

21 ఏళ్ల ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ఆస్ట్రేలియాకు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన కూపర్‌ను ఆస్ట్రేలియా టీమిండియాతో సెమీస్‌లో మ్యాచ్‌ కోసం ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కూపర్‌ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే షార్ట్‌ గాయంతో తప్పుకోవడంతో మరి ఆస్ట్రేలియా ఓపెనర్‌గా ట్రావిస్‌ హెడ్‌తో కలిసి ఎవరు ఓపెన్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో డాషింగ్‌ యంగ్‌ ఓపెనర్‌ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఉన్నాడు. మరి అతన్ని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? లేక వికెట్‌ కీపర్‌ ఇంగ్లిస్‌తో ఓపెన్‌ చేయిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏది ఏమైనా షార్ట్‌ గాయంతో దూరం కావడం ఆస్ట్రేలియాకు కచ్చితంగా పెద్ద దెబ్బ. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.