Cameron Green Auction Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో ఆస్ట్రేలియా ఎమర్జింగ్ బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకరైన కామెరాన్ గ్రీన్ పై కనక వర్షం కురుస్తుందని చాలామంది భావించారు. అనుకున్నట్లే ఐపీఎల్-2023 కోసం జరుగుతున్న వేలంలో గ్రీన్‌పై భారీ వర్షం కురిసింది. ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కోసం మూడు ఫ్రాంచైజీలు పోరాడాయి కానీ ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ గెలిచింది. ఏకంగా రూ.17.50 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసి జట్టుకు మరింత బలాన్ని తీసుకొచ్చింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆస్ట్రేలియా జట్టు భారతదేశ పర్యటనకు వచ్చింది. మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా గ్రీన్ చెలరేగిపోయాడు. మొత్తం మూడు మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అప్పటి నుంచి అతను ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ప్రపంచకప్‌లోనూ అంచనాలకు మించి రాణించాడు. మొదట గ్రీన్‌ని టీ20 ప్రపంచకప్‌లో చేర్చుకోలేదు. కానీ జట్టు రెండవ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయపడినప్పుడు, రెండవ వికెట్ కీపర్ స్థానంలో గ్రీన్ జట్టులో చోటు సంపాదించాడు.
గ్రీన్ టీ20 కెరీర్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా తరపుణ మొత్తం ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 173.75 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు తీసుకున్నాడు. కాగా ఈ సీజన్ లో ముంబైకి చెందిన అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. గతేడాది ఆ జట్టు 15.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డును గ్రీన్ అధగమించాడు.
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి