SRH: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఎలిమినేట్ చేసేయండి సార్.. ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్స్ చేశాడా.?

సగానికిపైగా మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా ఈ సమయంలో ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై ఇలాంటి తరహ ఆరోపణలు రాగా.. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ఆ వివరాలు..

SRH: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఎలిమినేట్ చేసేయండి సార్.. ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్స్ చేశాడా.?
Srh

Updated on: Apr 24, 2025 | 1:37 PM

సగానికిపైగా మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా ఈ సమయంలో ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై ఇలాంటి తరహ ఆరోపణలు రాగా.. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ తీవ్రమైన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీని వెనుక అసలు కారణం ఏంటంటే.? హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సమయంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించక ముందే పెవిలియన్‌కు వెళ్లాడు. వాస్తవానికి అంపైర్ లెగ్ సైడ్‌ వెళ్లిన ఈ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ఎటువంటి అప్పీల్ చేయలేదు. కానీ ఇషాన్ స్వయంగా పెవిలియన్‌కు తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత అంపైర్ కూడా అతన్ని అవుట్‌గా ప్రకటించాడు.

కానీ అది ఒక్కటే కాదు. రీప్లేలో బంతి ఇషాన్ కిషన్ బ్యాట్‌ను లేదా అతని శరీరంలోని ఏ భాగాన్ని కూడా తాకలేదని స్పష్టంగా కనిపించింది. అంటే బంతి దేనిని తాకలేదు కాబట్టి.. అంపైర్ వైడ్ నిర్ణయం కచ్చితంగా సరైనదే. అయితే అంపైర్ అవుట్ ఇవ్వకుండానే ఇషాన్ కిషన్ పెవిలియన్‌కు చేరడం అందరినీ షాక్‌కు గురిచేసింది. రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌ల ఫలితాల తర్వాత వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఈ మ్యాచ్‌పై ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తారు.

సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

ఈ మ్యాచ్‌లో రెండు జట్లు, ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ గురించి ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. ఈ సీజన్ ముందు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌లో భాగమైనందున చర్చ కొనసాగుతోంది.