Zim Afro T10: W,W,W,W,W,W.. గతేడాది రిటైర్మెంట్.. క‌ట్‌చేస్తే.. ప్రపంచ రికార్డు సృష్టించిన 42 ఏళ్ల బౌలర్..

|

Jul 23, 2023 | 9:08 AM

Zim Afro T10: ఆఫ్రో టీ10 లీగ్‌లో ఆడుతున్న 42 ఏళ్ల ఆటగాడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఆటగాడు కేవలం 2 ఓవర్లలో 6 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆఫ్రో T10 లీగ్ జింబాబ్వేలో జులై 20 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నీలో శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్, బులవాయో బ్రేవ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

Zim Afro T10: W,W,W,W,W,W.. గతేడాది రిటైర్మెంట్.. క‌ట్‌చేస్తే.. ప్రపంచ రికార్డు సృష్టించిన 42 ఏళ్ల బౌలర్..
Zim Afro T10 Mohammad Hafeez
Follow us on

Zim Afro T10 2023: ఆఫ్రో T10 లీగ్ జింబాబ్వేలో జులై 20 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నీలో శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్, బులవాయో బ్రేవ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 42 ఏళ్ల ఆటగాడు కేవలం 2 ఓవర్లలో 6 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకుముందు టీ10 క్రికెట్‌లో ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్‌లో 6 వికెట్లు తీయలేదు. అయితే, గత సంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఓ ఆటగాడు ఈ సంచలనాన్ని నమోదు చేశాడు.

ప్రపంచ రికార్డు సృష్టించిన 42 ఏళ్ల బౌలర్..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ప్రస్తుతం ఆఫ్రో టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. బులవాయో బ్రేవ్స్‌పై జోబర్గ్ బఫెలోస్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ బలంగా బౌలింగ్ చేశాడు. ఆఫ్ స్పిన్నర్ హఫీజ్ 2 ఓవర్లలో 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తన కోటాలో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఓవర్‌ ఐదో బంతికి వికెట్‌ తీశాడు. తన రెండో ఓవర్‌లోనూ 3 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

5 వికెట్లు తీసిన బౌలర్లు..

మహ్మద్ హఫీజ్ కంటే ముందు టీ10 క్రికెట్‌లో వనిందు హసరంగా, ప్రవీణ్ తాంబే, మర్చంట్ డిలాంగే తలో 5 వికెట్లు పడగొట్టారు. అయితే 6 వికెట్ల ఫీట్ మొదటిసారి కనిపించింది. మహ్మద్ హఫీజ్ తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా అతని జట్టు జోబర్గ్ బఫెలోస్‌కు విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్..

పాకిస్థాన్ తరపున 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మహ్మద్ హఫీజ్ 2018లో టెస్టు క్రికెట్‌కు రిటైరయ్యాడు. మూడు ఫార్మాట్లలో హఫీజ్ పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను 3 ఏప్రిల్ 2003న షార్జాలో జింబాబ్వేపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. అతను పాకిస్తాన్ తరపున మూడు ICC ప్రపంచ కప్‌లు, ఆరు T20 ప్రపంచ కప్‌లు ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..