Asian Games 2023: ‘మేం సాధించాం, ఇప్పుడు మీ వంతు’.. భారత జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ సందేశం..

Asian Games 2023: శ్రీలంక పరుషుల జట్టుని చిత్తుచేసిన భారత జట్టు ఆసియా కప్ 2023 టైటిల్‌ విన్నర్‌గా నిలిచి 10 రోజులు కూడా కాక ముందే.. భారత మహిళల జట్టు కూడా ఆసియా క్రీడల్లో క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం లంకను మట్టికరిపించింది. అంటే 10 రోజుల వ్యవధిలోనే శ్రీలంకను భారత్ రెండు సార్లు టైటిల్ మ్యాచ్‌లో ఓడించింది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన..

Asian Games 2023: ‘మేం సాధించాం, ఇప్పుడు మీ వంతు’.. భారత జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ సందేశం..
Jemiamah Rodrigues; Team India Captain Ruthuraj Gaikwad

Updated on: Sep 26, 2023 | 4:40 PM

Asian Games 2023: శ్రీలంక పరుషుల జట్టుని చిత్తుచేసిన భారత జట్టు ఆసియా కప్ 2023 టైటిల్‌ విన్నర్‌గా నిలిచి 10 రోజులు కూడా కాక ముందే.. భారత మహిళల జట్టు కూడా ఆసియా క్రీడల్లో క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం లంకను మట్టికరిపించింది. అంటే 10 రోజుల వ్యవధిలోనే శ్రీలంకను భారత్ రెండు సార్లు టైటిల్ మ్యాచ్‌లో ఓడించింది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన మహిళల క్రికెట్ ఫైనల్‌లో లంకపై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 42 పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ భారత పురుషుల జట్టుకు కీలక సందేశం ఇచ్చింది. మ్యాచ్ అనంతరం రోడ్రిగ్స్ మాట్లాడుతూ ‘‘మేం పురుషుల జట్టుతో మాట్లాడాం. ‘మేం గోల్డ్ మెడల్స్ సాధించాం, మీరు కూడా గెలవాలి’ అని చెప్పాం’’ అని పేర్కొంది.

తొలి ‘బంగారం’

విశేషం ఏమిటంటే.. ఆసియా క్రీడల్లో ఈ ఏడాదే ఆరంగేట్రం చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు, తొలి ప్రదర్శనలోనే గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మరోవైపు భారత పురుషుల జట్టు కూడా తొలి సారిగా ఆసియా క్రీడల్లో ఆడనుండగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలోని టీమిండియా అక్టోబర్ 3న నేరుగా క్వార్టర్ ఫైనల్‌ ఆడనుంది.

ఆసియా క్రీడల కోసం భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ( వికెట్ కీపర్), ఆకాష్ దీప్

స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..