David Warner: T20 వరల్డ్ కప్ 2021లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ని గెలుచుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాడు. ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్ కారణంగా నెటిజన్లు డేవిడ్ వార్నర్‌ని నిరంతరం ట్రోల్ చేశారు. అయితే ఈ ఆటగాడు T20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అందరి నోళ్లు మూయించాడు. ఆస్ట్రేలియాని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వార్నర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు మిచెల్ మార్ష్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
వార్నర్ ఈ ప్రదర్శన చూసిన తర్వాత నెటిజన్లు IPL ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి డేవిడ్ వార్నర్‌ని IPL 2021 సమయంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. కొన్ని మ్యాచ్‌లలో ఈ ఆటగాడిని ప్లేయింగ్ XI నుంచి కూడా దూరంగా ఉంచారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ షాకింగ్ విషయాన్ని బహిర్గతం చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా డేవిడ్ వార్నర్‌ని ప్లేయింగ్ XI నుంచి తొలగించలేదని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
వార్నర్‌ను తొలగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ సిబ్బంది అనుకూలంగా లేరని తెలిపాడు. కానీ ప్లేయింగ్ XI నుంచి వార్నర్‌ని తప్పించడానికి కారణం క్రికెట్‌కు భిన్నంగా ఉందని మాత్రం చెప్పాడు. దీనికి అసలైన కారణాన్ని చెప్పడానికి హాడిన్ నిరాకరించాడు. డేవిడ్ వార్నర్ ఇకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడటానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వార్నర్ IPL చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. రాబోయే మెగా వేలంలో అతన్ని ఇతర జట్లు భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
టీ20 ప్రపంచకప్‌లో వార్నర్ ప్రదర్శన
ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 7 మ్యాచ్‌ల్లో 48 కంటే ఎక్కువ సగటుతో 289 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 146 కంటే ఎక్కువ. దీంతో పాటు వార్నర్ బ్యాట్ నుంచి 3 హాఫ్ సెంచరీలు వచ్చాయి. సెమీ-ఫైనల్‌లోనూ పాకిస్థాన్‌పై 49 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్‌ను ఆడడం ద్వారా వార్నర్ ఆస్ట్రేలియా విజయానికి పెద్ద సహకారం అందించాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌కు కూడా అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ఆటగాడు 150 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 41.6 అసమాన సగటుతో 5449 పరుగులు చేశాడు.